Thursday, March 23, 2023
More
    Homelatestకేటీఆర్, బండి సంజయ్ దోబూచులాట: ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్

    కేటీఆర్, బండి సంజయ్ దోబూచులాట: ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్

    • చిన్నోనిపల్లి రైతుల అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం
    • డీకే అరుణ క్షమాపణ చెప్పాలి 

    జోగులాంబ గద్వాల జిల్లా: చిన్నోనిపల్లి రైతుల అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పటేల్ ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. చిన్నోనిపల్లి రిజర్వాయర్ ను రద్దు చేయాలని కోరుతూ గత 425 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న రైతులను అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు.

    అరెస్టు చేసిన చిన్నోనిపల్లి రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ప్రయోజనం లేని రిజర్వాయర్ ను రద్దు చేయాలని కోరుతూ చిన్నోనిపల్లి, బోయిలగూడెం, ఇందువాసి, చాగదోన మరియు లింగాపురం రైతులు గత 425 రోజులుగా రిజర్వాయర్ వద్ద నిరసన దీక్షలు చేపట్టారన్నారు.

    అర్ధరాత్రి పోలీసులు గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ దీక్షలో పాల్గొంటున్న రైతులను అక్రమంగా అరెస్టులు చేశారని, వివిధ పోలీస్ స్టేషన్ల లో వారిని ఉంచి బైండోవర్ కేసులు చేస్తున్నారని విమర్శించారు.

    2013 భూ సేకరణ చట్టం ప్రకారం నిర్ణీత గడువులోగా ప్రాజెక్టు పూర్తి చేయకపోతే భూములు తిరిగి రైతులకు స్వాధీనం చేయాలని అన్నారు. దాదాపు 300 మంది పోలీసులను గ్రామాలలో మోహరించి బయోత్పాతం సృష్టిస్తున్నారని ఆరోపించారు. రైతులను ఉగ్రవాదుల లాగా చూస్తున్నారని రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో దీన్నిబట్టి అర్థం అవుతుందని అన్నారు.

    తక్షణమే అరెస్టు చేసిన రైతులందరినీ బేషరతుగా విడుదల చేయాలని, ప్రాజెక్టు పనులను నిలిపి వేయాలని, రైతుల భూములు రైతులకే తిరిగి స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్, బండి సంజయ్ ఇద్దరు దోబూచులాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

    జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు ఉపయోగపడని ప్రాజెక్టును తీసుకొచ్చి రైతులను అన్యాయం చేశారని ఇందుకు బాధ్యులుగా వ్యవహరిస్తూ మాజీ మంత్రి డీకే అరుణ బేశరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular