విధాత: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో దొంగల ముసుగులు తొలిగాయని కేటీఆర్ పేర్కొన్నారు.
దొంగలకు నార్కో అనాలిసిస్, లై డిటెక్టర్ టెస్టులకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. స్కాంలో స్వామిజీలతో సంబంధం లేదన్న వారు సంబురాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. సంబంధం లేదన్నవారు దొంగలను భుజాలపై మోస్తున్నారని ధ్వజమెత్తారు.
కుట్ర కేసు జేబు సంస్థ సీబీఐకి చిక్కినందుకు కిషన్ రెడ్డికి సంబురమా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి అప్పగిస్తే బీజేపీ సంబురాల మర్మం ఏంటని నిలదీశారు.
కలుగులో దాక్కున్న దొంగలు మెల్లిగా బయటికి వస్తున్నారని పేర్కొన్నారు. ఆపరేషన్ లోటస్ బెడిసికొట్టి అడ్డంగా దొరికారు అని ధ్వజమెత్తారు. నేరం చేసిన వారు ప్రజాకోర్టులో తప్పించుకోలేరని కేటీఆర్ తెలిపారు.