కేటీఆర్‌కు 100 కోట్లు ఇస్తే అమ్మనా బూతులు తిట్టవచ్చా కేటీఆర్‌తో సహా టీఎస్పీఎస్సీ అధికారులందరినీ విచారించండి పేపర్‌ లీకేజీ కేసులో శంకర లక్ష్మి నుంచే నేరం మొదలైంది దొంగలకు, దోపిడి దారులకు, అవినీతి పరులకు అడ్డాగా టీఎస్పీఎస్సీ ఏ-1గా శంకర లక్ష్మి.ఏ-2గా చైర్మన్‌, సెక్రటరీలను పెట్టాలి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విధాత: పేపర్‌ లీకేజీలో నగదు లావాదేవీలపూ విచారణ జరుపాలని కాంగ్రెస్‌ పార్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)ను కోరింది. ఈ మేరకు శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి […]

  • కేటీఆర్‌కు 100 కోట్లు ఇస్తే అమ్మనా బూతులు తిట్టవచ్చా
  • కేటీఆర్‌తో సహా టీఎస్పీఎస్సీ అధికారులందరినీ విచారించండి
  • పేపర్‌ లీకేజీ కేసులో శంకర లక్ష్మి నుంచే నేరం మొదలైంది
  • దొంగలకు, దోపిడి దారులకు, అవినీతి పరులకు అడ్డాగా టీఎస్పీఎస్సీ
  • ఏ-1గా శంకర లక్ష్మి.ఏ-2గా చైర్మన్‌, సెక్రటరీలను పెట్టాలి
  • టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

విధాత: పేపర్‌ లీకేజీలో నగదు లావాదేవీలపూ విచారణ జరుపాలని కాంగ్రెస్‌ పార్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)ను కోరింది. ఈ మేరకు శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ నేతల బృందం హైదరాబాద్‌ జాయింట్‌ డైరెక్టర్‌ రోహిత్‌ ఆనంద్‌ను కలిసింది.

ఈడీని కలిసిన అనంతరం కార్యాలయం బయట పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ ఎస్‌ ప్రభుత్వం లక్షల మంది నిరుద్యోగులతో చెలగాటం ఆడుతుందని ఆరోపించారు. టీఎస్పీస్సీలో పేపర్‌ లీకేజీ అయితే ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదన్నారు.

పేపర్‌ లీకేజీ అయి ఇన్ని రోజులు గడిచినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంత వరకు స్పందించలేదన్నారు.
ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ను కలిసిన వారిలో రేవంత్‌రెడ్డితో పాటు నేతలు మహేష్ కుమార్ గౌడ్ , మల్లు రవి తదితరులున్నారు.

పేపర్‌ లీకేసీ కేసులో కేటీఆర్ తో సహా టీఎస్పీఎస్సీ అధికారులందరినీ విచారించాలని ఈడీని కోరినట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. సిట్ కొద్ది మందినే విచారిస్తుందని మాకు సమాచారం ఉందని, పూర్తి సమాచారం సేకరించి విచారణ చేయాలని ఈడీ అధికారులను కోరామని రేవంత్‌ మీడియాకు తెలిపారు.

జగిత్యాల జిల్లాలో పరీక్ష రాసిన వారి సమాచారం కేటీఆర్ కు అందించిన వారు ఎవరని రేవంత్‌ ప్రశ్నించారు. కటాఫ్ మార్కుల గురించి పరీక్ష రాసిన అభ్యర్థులకె తెలియదని, మరి కేటీఆర్ కు ఈ విషయాలు ఎలా తెలిశాయని అడిగారు. పారదర్శక విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఈడీ అధికారులు హామీ ఇచ్చారన్నారు.

టీఎస్పీఎస్సీ దొంగలకు, దోపీడీదారులకు, అవినీతిపరులకు అడ్డాగా మారిందని, పరీక్షల నిర్వహణలో ఆశ్రిత పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని రేవంత్‌ ఆరోపించారు. వందలాది మంది నిరుద్యోగులు ప్రాణాలు కోల్పోయినా కల్వకుంట్ల కుటుంబానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. కేసుతో లింక్ ఉన్న ప్రభుత్వ పెద్దలను అమరవీరుల స్థూపం ముందు ఉరేసినా తప్పులేదన్నారు.

ఇంత జరిగిన తరువాత నిరుద్యోగులకు కేటీఆర్ క్షమాపణ చెప్పి పారదర్శక విచారణ చేయిస్తారనుకున్నాం, కానీ సిట్ తో కేసులు వేయించి మా విద్యార్థి నాయకులను నిర్బంధించడం సిగ్గుచేటన్నారు. పేపర్ లీకేజ్లో నేరమే శంకరలక్ష్మి దగ్గర నుంచి మొదలైందని రేవంత్‌ అన్నారు. ఈ కేసు విచారణలో ఏ1 గా శంకర లక్ష్మిని, ఏ2గా చైర్మన్, సెక్రెటరీలను పెట్టాలని డిమాండ్‌ చేశారు.

కేసులో కావాల్సిన వారిని కాపాడి చిన్న ఉద్యోగులను బలిచేసే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్‌ ఆరోపించారు. ఈ అంశంపై మేం ఇప్పటికే కోర్టును ఆశ్రయించామని తెలిపారు. కోర్టులో కేసు విచారణ జరుగుతోందని, ఈడీ జాయింట్ డైరెక్టర్ ను కలిసి పిర్యాదు చేశామన్నారు. 420, 120బీ సెక్షన్లు ఈడీ పరిధిలోకి వస్తాయని రేవంత్‌ తెలిపారు.

పరువున్న వారు పరువు నష్టం దావా వేస్తారని రేవంత్‌ రెడ్డి అన్నారు. కేటీఆర్ తెలంగాణ పరువును పోగొట్టారన్నారు. నిజంగా కేటీఆర్ కు పరువు ఉంటే సీబీఐ, ఈడీ అధికారులతో పారదర్శక విచారణకు అదేశాలివ్వాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని లేఖ రాయాలన్నారు. కేటీఆర్‌కు 100 కోట్లు ఇస్తే అమ్మనా బూతులు తిట్టవచ్చా అని అడిగారు.

కేటీఆర్‌ ఏమైనా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సినిమాకు సైన్‌ చేసినట్లా, లేక సమంతా సిరిస్‌కు సంతకం పెట్టినట్లు అగ్రిమెంట్లు చేసుకోవడానికా అని రేవంత్‌ రెడ్డి నిలదీశారు. పరువు ఖరీదు రూ. 100కోట్లు అని ఎలా నిర్ణయిస్తారని అడిగారు. విద్యార్థులు, నిరుద్యోగుల ఉసురు తీయొద్దని, వాళ్ల ఉసురు తగిలితే సర్వనాశనం అయిపోతారన్నారు. ఈ కేసులో ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదని రేవంత్‌ తేల్చి చెప్పారు.

Updated On 1 April 2023 3:10 AM GMT
krs

krs

Next Story