విధాత: హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వచ్చింది. ఎల్బీ నగర్ - సికింద్రాబాద్ మార్గంలో నాగోల్ వద్ద కీలక ఫ్లై ఓవర్ ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. నిత్యం ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండడంతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్‌డీపీ) కింద రూ. 143 కోట్లతో 990 మీటర్ల పొడవునా ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్ వల్ల ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ వరకూ ఎలాంటి సిగ్నళ్లు లేకుండా సాఫీగా […]

విధాత: హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వచ్చింది. ఎల్బీ నగర్ - సికింద్రాబాద్ మార్గంలో నాగోల్ వద్ద కీలక ఫ్లై ఓవర్ ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. నిత్యం ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండడంతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్‌డీపీ) కింద రూ. 143 కోట్లతో 990 మీటర్ల పొడవునా ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు.

ఈ ఫ్లై ఓవర్ వల్ల ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ వరకూ ఎలాంటి సిగ్నళ్లు లేకుండా సాఫీగా వెళ్లిపోవచ్చు. వంతెన ప్రారంభం అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. నగరంలో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెడుతున్నాం అన్నారు.

కాగా.. నగర విస్తరణకు తగ్గ విధంగా మౌలిక వసతుల కల్పన కోసం ప్లాన్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. లేదంటే బెంగళూరు తరహాలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. ట్రాఫిక్ ఇబ్బందు లను దృష్టిలో పెట్టుకొని ఎఎస్సార్‌డీపీ కార్యక్రమాన్ని తీసుకుమని.. రూ. 8వేల 52 కోట్లతో 47 ప్రాజెక్టులు చేపట్టినట్లు వెల్లడించారు.

ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లోనే 16 ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. రెండవ దశలో 12 ప్రాజెక్టులను చేపడుతున్నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎస్‌ఆర్‌డీపీ కింద మొత్తం 47 ప్రాజెక్టులను చేపట్టిందని తెలిపారు. ఇప్పటి వరకు 31 ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు. మరో 16 ఫ్లై ఓవర్ పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. పూర్తయిన 31 పనుల్లో 15 ఫ్లై ఓవర్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని కేటీఆర్ చెప్పారు.

‘హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే వారికి గతంలో చాలా ట్రాఫిక్ కష్టాలు ఉండేవి. ఇప్పుడు అవి తగ్గిపోయాయి. ఎల్బీనగర్ నియోజకవర్గలో 700 కోట్లకు పైగా ఖర్చు చేసి 9 ప్రాజెక్టులు పూర్తి చేశాం. రాబోయే నాలుగైదు నెలల్లో ఈ ప్రాంతంలోని ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చేలా చూస్తామన్నారు.

ఎల్బీనగర్ ప్రాంతంలో 600 కోట్లు ఖర్చు చేసి తాగునీటి సమస్య లేకుండా చేశాం. భవిష్యత్తు తరాలకు మెరుగైన వసతులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం. మౌలిక వసతులతో పాటు దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. రాజకీయాలు ఎన్నికల అప్పుడు చేద్దాం. ఇప్పుడు అభివృద్ధి పై ఫోకస్ చేద్దాం’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు

Updated On 26 Oct 2022 11:18 AM GMT
krs

krs

Next Story