విధాత : కేంద్ర ప్ర‌భుత్వం అందిస్తున్న ఆర్థిక సంఘం, ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాల నిధుల‌తోనే గ్రామాల్లో అభివృద్ధి జ‌రుగుతుంద‌ని బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యులు ల‌క్ష్మ‌ణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప‌రిస్థితి సొమ్ము కేంద్రానిది అయితే.. సోకు తెలంగాణది అయింద‌ని ల‌క్ష్మ‌ణ్ అన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఎవ‌రి సొమ్ముతో ఎవ‌రు సోకులు ప‌డుతున్నార‌ని ల‌క్ష్మ‌ణ్‌ను కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శ్నించారు. తెలంగాణ సొమ్ముతో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న గరీబు […]

విధాత : కేంద్ర ప్ర‌భుత్వం అందిస్తున్న ఆర్థిక సంఘం, ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాల నిధుల‌తోనే గ్రామాల్లో అభివృద్ధి జ‌రుగుతుంద‌ని బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యులు ల‌క్ష్మ‌ణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప‌రిస్థితి సొమ్ము కేంద్రానిది అయితే.. సోకు తెలంగాణది అయింద‌ని ల‌క్ష్మ‌ణ్ అన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు.

ఎవ‌రి సొమ్ముతో ఎవ‌రు సోకులు ప‌డుతున్నార‌ని ల‌క్ష్మ‌ణ్‌ను కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శ్నించారు. తెలంగాణ సొమ్ముతో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న గరీబు ఉత్తర ప్రదేశ్ సోకులు పడుతున్నదని తెలిపారు. దేశ అభివృద్ధికి తెలంగాణ‌ దోహద ప‌డుతున్నందుకు థాంక్స్ చెప్పండి. లెక్కలు తెలుసుకోండి.. ఆత్మవంచన చేసుకుంటే మీ ఇష్టం కానీ ప్రజలని మభ్య పెట్టకండి అని కేటీఆర్ సూచించారు.

Updated On 22 Sep 2022 1:33 PM GMT
subbareddy

subbareddy

Next Story