Kushi | ప్రేమ చిత్రాల స్పెషలిస్ట్ శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఖుషి’. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 1న థియేటర్స్‌లో విడుదలై.. పాజిటివ్ టాక్‌తో కలెక్షన్లను కొల్లగొడుతుంది. యుఎస్ బాక్సాఫీస్ వద్ద అలాగే తమిళనాడులోనూ ఈ సినిమా రికార్డులను క్రియేట్ చేసేలా కలెక్షన్స్ రాబడుతుండటం విశేషం. యుఎస్‌లో 2 మిలియన్ మార్క్‌కు ఖుషి పరుగులు పెడుతుండగా.. తమిళనాడులో ఇప్పటికే 7 కోట్ల ప్లస్ […]

Kushi |

ప్రేమ చిత్రాల స్పెషలిస్ట్ శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఖుషి’. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 1న థియేటర్స్‌లో విడుదలై.. పాజిటివ్ టాక్‌తో కలెక్షన్లను కొల్లగొడుతుంది. యుఎస్ బాక్సాఫీస్ వద్ద అలాగే తమిళనాడులోనూ ఈ సినిమా రికార్డులను క్రియేట్ చేసేలా కలెక్షన్స్ రాబడుతుండటం విశేషం.

యుఎస్‌లో 2 మిలియన్ మార్క్‌కు ఖుషి పరుగులు పెడుతుండగా.. తమిళనాడులో ఇప్పటికే 7 కోట్ల ప్లస్ కలెక్షన్స్ రాబట్టి రికార్డును క్రియేట్ చేసింది. థియేటర్స్ డల్‌గా ఉండే వీక్ డేస్‌లో కూడా ‘ఖుషి’ నైజాం, ఏపీలోని అన్ని ఏరియాస్‌లో చెప్పుకోదగిన కలెక్షన్స్ రాబడుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ సంబంధించి కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

ఖుషి సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాని 5 వారాల అనంతరం ఓటీటీకి రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే సెప్టెంబర్ 1న సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. 5 వారాల అనంతరం అంటే అక్టోబర్ 6న ఈ సినిమాని తెలుగుతో పాటు ఇతర లాంగ్వేజెస్‌లో కూడా విడుదల చేయనుందనేలా సోషల్ మాధ్యమాలలో టాక్ నడుస్తుంది.

‘ఖుషి’ డిజిటల్ రైట్స్‌కి భారీ డిమాండ్ ఏర్పడిన విషయం తెలిసిందే. ‘ఖుషి’ డిజిటల్, శాటిలైట్ రైట్స్ రెండు కలిపి దాదాపు రూ. 90 కోట్లకు అమ్ముడైనట్లుగా తెలుస్తోంది. సో.. ఎలా చూసినా నిర్మాతలకు ఈ ఖుషి ప్రాపిటబుల్ ప్రాజెక్టే అని చెప్పుకోవచ్చు.

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. దేవుడంటే నమ్మకంలేని విప్లవాత్మక భావాలు కలిగిన ఫ్యామిలీకి చెందిన విప్లవ్ (విజయ్ దేవరకొండ).. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలనే కసితో.. బిఎస్‌ఎన్ఎల్‌లో జాబ్ సంపాదిస్తాడు. కశ్మీర్‌లో పోస్ట్ వేయించుకున్న అతనికి అక్కడ ఆరా బేగం (సమంత) కనిపిస్తుంది. ఆమెను చూడగానే ప్రేమలో పడటమే కాకుండా.. తనే తన లైఫ్ పార్టనర్‌ అని ఫిక్సవుతాడు. ఇలా కొన్ని సంఘటనల తర్వాత ఇద్దరూ ప్రేమలో మునిగిపోతారు.

కట్ చేస్తే.. తను బేగం కాదని బ్రాహ్మిణ్ అని తెలిసిన తర్వాత.. అసలు ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రవచనాలు చెప్పుకుని, దేవుడిని అమితంగా నమ్మే ఆరాధ్య (సమంత) తండ్రి (మురళీ శర్మ).. వారి ప్రేమను అంగీకరించడు. నాస్తిక ఫ్యామిలీ‌కి తన కుమార్తెను ఇవ్వడం ఇష్టపడని ఆయన.. ఒకవేళ వారు కలిసి ఉన్నా.. కలకాలం సుఖంగా జీవించలేరని భావిస్తాడు.

అయినా సరే.. ప్రేమ జంట ఫ్యామీలీని కాదని.. పెళ్లి చేసుకుని ఉత్తమ జంటగా నిలవాలని భావిస్తోంది. అలా తలిచి పెళ్లి చేసుకున్న ఆ జంట మధ్య ఏం జరిగింది? వాళ్లు ఆశించింది జరిగిందా? వారి కథ చివరికి ఎలా సుఖాంతమైంది? అనేది తెలుసుకోవాలంటే ఎంటర్‌టైన్‌మెంట్‌గానూ అలాగే ఎమోషనల్‌గానూ సాగిన ఈ సినిమాని చూడాల్సిందే.

Updated On 8 Sep 2023 8:55 AM GMT
krs

krs

Next Story