Tuesday, January 31, 2023
More
  Homeతెలంగాణ‌కార్మికుల పక్షపాతి CM KCR: మంత్రి జగదీష్ రెడ్డి

  కార్మికుల పక్షపాతి CM KCR: మంత్రి జగదీష్ రెడ్డి

  • అధిక సంఖ్యలో బీఆర్ ఎస్‌కేవీలో చేరిన మున్సిపల్ కార్మికులు

  విధాత: సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ ఎస్‌కేవీ మున్సిపల్ యూనియన్ లో అధిక సంఖ్యలో చేరిన సూర్యాపేట మున్సిపల్ కార్మికులకు జగదీష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.

  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు కార్మికుల పరిస్థితి అధ్వాన్నంగా వుండేదని, 2014 తరువాత సీఎం కేసీఆర్ కాంట్రాక్టు కార్మికులకు 30% పీఆర్సీ అమలు చేశారని, దేశవ్యాప్తంగా పొరుగు సేవల ఒప్పంద కార్మికులకు పీఆర్సీ అమలు చేసిన‌ ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు.

  రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున సంక్షేమ పథ‌కాలు అమలుచేస్తుందని, ప్రతి ఏటా సంక్షేమ పథ‌కాల కోసం 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రం గుజరాత్ లో కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి అధ్వాన్నంగా వుందని, గుజరాత్ లో కార్మికులకు భధ్రత లేదని, కనీస వేతనాలు ఇవ్వడం లేదని అన్నారు.

  మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను రూ.6000ల నుండి రూ.15000లకు పెంచామన్నారు. గుజరాత్ లో ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని, రైతులకు ఎటువంటి సంక్షేమ పధకాలు అమలు చేయడం లేదని అన్నారు. కాని బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్రంపై కుట్రలు చేస్తూ దాడి చేస్తున్నారని మంత్రి అన్నారు.

  సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈఎస్ ఐ ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేస్తానని, కార్మికుల సమస్యలు పరిష్కారిస్తామని హామీనిచ్చారు. ఒప్పంద కార్మికులకు కూడా త్వరలోనే సబ్బులు, బట్టలు పంపిణీ చేస్తామని చెప్పారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బిఆర్ ఎస్ కెవి నిరంతరం పనిచేస్తుందన్నారు.

  కార్మిక నాయకులు వల్దాసు మధుసూదన్, చాగంటి వెంకట రమణతో పాటు వంద‌లాది మున్సిపల్ కార్మికులు బిఆర్ ఎస్ కెవిలో చేరారు. కార్యక్రమంలో బిఆర్ ఎస్ కెవి రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ‌ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, పార్టీ నాయకులు గండూరి ప్రకాష్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశ, అడ్వకేట్ బాణాల విజయ్ కుమార్, కౌన్సిలర్ తెహర్ పాషా, వల్దాస్ సౌమ్య జాని, కో ఆప్షన్ సభ్యులు వెంపటి సురేష్, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చిలువేలు ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు జల్లి కృష్ణ, వెంపటి గురూజి, సమి, జవాన్లు, కార్మికులు పాల్గొన్నారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular