Serial Kisser: సీరియల్ కిల్లర్స్, సీరియల్ చైన్ స్నాచర్స్ గురించి వార్తా పత్రికల్లో చదివే ఉంటారు. టీవీల్లో చూసి కూడా ఉంటారు. కానీ వీడు అలాంటి ఇలాంటోడు కాదు.. సీరియల్ కిస్సర్. మాములుగా అయితే అమ్మాయిలు కనిపిస్తే ఆకతాయిలు ఏడిపిస్తుంటారు.. వెంబడించి అల్లరి పెడుతూ ఉంటారు.
మరి కొంతమంది ఎవరూ లేని సమయం చూసి మహిళల మెడలో నుంచి బంగారు చైన్‌లు లాక్కెళ్లడం చూస్తూ ఉంటాం. కానీ సీరియల్ కిస్సర్(Serial Kisser) అలాంటివాడు కాదు.. వీడు చాలా వరస్ట్‌గాడు.. అమ్మాయిలు అనే కాదు మహిళలు కనిపించినా చాలు వెంటనే ముద్దు పెట్టేస్తాడు. అది కూడా లిప్ టు లిప్ కిస్. ఆ తర్వాత క్షణాల్లో అక్కడి నుంచి మాయమైపోతాడు.
ఇలాంటి ఘటనే ఒకటి బీహార్(Bihar)లోని జమయి(Jamai)లో జరిగింది. ఒక హాస్పిటల్(Hospital) ప్రాంగణంలో మహిళ మొబైల్(Mobile)లో ఎవరితోనే మాట్లాడుతున్నది. అదే సమయంలో ఒక యువకుడు వెనుక నుంచి వచ్చి సదరు మహిళను బలవంతంగా ముద్దు పెట్టుకోవడం ప్రారంభించాడు. కొంత సమయం వరకు ఆ యువకుడు మహిళను ముద్దు పెడుతూనే ఉన్నాడు. తర్వాత క్షణాల్లో అక్కడి నుంచి పారిపోయాడు. ఇదంతా అక్కడ ఉన్న సీసీ టీవీలో రికార్డు అయింది.
సీసీ టీవీ కెమెరాలో రికార్డయిన వీడియో బయటకు రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో వీడియో చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ దారుణ సంఘటన చూసిన వారు ఆందోళనకు గురవుతున్నారు. సదరు బాధిత మహిళ ఈ ఘటనపై పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.