Saturday, April 1, 2023
More
    HomelatestNayanthara | లేడిసూపర్‌ స్టార్‌ నయనతార సంచలన నిర్ణయం..! షాక్‌లో అభిమానులు..!

    Nayanthara | లేడిసూపర్‌ స్టార్‌ నయనతార సంచలన నిర్ణయం..! షాక్‌లో అభిమానులు..!

    Nayanthara | నయనతార పరిచయం అక్కర్లేని పేరు. తన నటనతో లేడి సూపర్‌స్టార్‌గా ఎదిగింది. దక్షిణ భారతలోని అన్ని భాషల్లో నటిస్తూ అదరగొడుతున్నది. హీరోలతో సరి సమానంగా పారితోషకం తీసుకునే స్థాయికి ఎదిగింది. డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌తో ప్రేమలో పడి దాదాపు ఏడేళ్లపాటు రిలేషన్ షిప్‌లో ఉండి పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. అయితే, తాజాగా నయనతార నటనకు గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తున్నది. వరుస చిత్రాలతో ఎప్పుడూ బిజీగా ఉండే లేడి సూపర్‌స్టార్‌ కొంతకాలం పాటు నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.

    ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాలను పూర్తిచేసిన తర్వాత కొద్దికాలం పాటు సినిమాలను పక్కన పెడుతుందని తెలుస్తుండగా.. ఇందుకు పిల్లలే కారణంగా సమాచారం. చిన్నారుల ఆలనా పాలన తానే చూసుకోవాలని భావిస్తుందని, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టాక్‌ వినిపిస్తున్నది. అలాగే తన సొంత నిర్మాణ సంస్థపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇటీవల కనెక్ట్‌ సినిమాతో అభిమానుల ముందుకు వచ్చింది. బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌.. డైరెక్టర్‌ అట్లీ కాంబోలో రానున్న ‘జవాన్‌’ చిత్రంలో నటిస్తున్నది. విజయ్ సేతుపతి కీలకపాత్రలో కనిపించనున్నాడు. జూన్‌ 2న విడుదల కానున్నట్లు పేర్కొన్నారు.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular