వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాధ్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పోలీస్ స్టేషన్‌కు వచ్చే భూ తగాదా కేసుల్లో అధికారులు పారదర్శకంగా వ్యవహరిస్తూ తగు విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు పిలుపునిచ్చారు. వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారులతో శనివారం నేర సమీక్షా సమావేశం హనుమకొండలో నిర్వహించారు. సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ తీసుకవచ్చే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించవద్దన్నారు. శాంతిభద్రతకు సంబంధించి ప్రజలకు […]

  • వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాధ్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పోలీస్ స్టేషన్‌కు వచ్చే భూ తగాదా కేసుల్లో అధికారులు పారదర్శకంగా వ్యవహరిస్తూ తగు విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు పిలుపునిచ్చారు. వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారులతో శనివారం నేర సమీక్షా సమావేశం హనుమకొండలో నిర్వహించారు.

సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ తీసుకవచ్చే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించవద్దన్నారు. శాంతిభద్రతకు సంబంధించి ప్రజలకు ఎలాంటి అభద్ర భావం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు, సిబ్బంది ముమ్మరంగా పెట్రోలింగ్ విధులు నిర్వహించాలన్నారు.

నేరనియంత్రణ కోసం ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే రౌడీషీటర్ల పై నిఘా పెట్టాలన్నారు. ఈ సమావేశంలో డీసీపీలు కరుణాకర్, సీతారాం, మురళీధర్, అదనపు డీసీపీలు పుష్పా,సంజీవ్, సురేష్ కుమార్ తో పాటు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Updated On 25 Feb 2023 1:07 PM GMT
Somu

Somu

Next Story