విధాత : ఓ యువ‌క‌డు త‌న తండ్రి కోసం ఫ్లిప్‌కార్ట్‌లో ల్యాప్‌టాప్ ఆర్డ‌ర్ చేస్తే బ‌ట్ట‌ల స‌బ్బులు డెలివ‌రీ అయ్యాయి. ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఐఐఎం అహ్మ‌దాబాద్‌లో చదువుతున్న య‌శ‌స్వి శ‌ర్మ‌.. త‌న తండ్రి కోసం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియ‌న్ డేస్ సేల్‌లో ల్యాప్‌టాప్ ఆర్డ‌ర్ చేశాడు. ఆ ఆర్డ‌ర్‌ను డెలివ‌రీ ఎగ్జిక్యూటివ్ డెలివ‌రీ చేశాడు. య‌శ‌స్వి తండ్రి ఆ ఆర్డ‌ర్‌ను ఓపెన్ చేయ‌గా ల్యాప్‌టాప్‌కు బదులుగా బ‌ట్ట‌లు స‌బ్బులు ద‌ర్శ‌న‌మిచ్చాయి. […]

విధాత : ఓ యువ‌క‌డు త‌న తండ్రి కోసం ఫ్లిప్‌కార్ట్‌లో ల్యాప్‌టాప్ ఆర్డ‌ర్ చేస్తే బ‌ట్ట‌ల స‌బ్బులు డెలివ‌రీ అయ్యాయి. ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఐఐఎం అహ్మ‌దాబాద్‌లో చదువుతున్న య‌శ‌స్వి శ‌ర్మ‌.. త‌న తండ్రి కోసం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియ‌న్ డేస్ సేల్‌లో ల్యాప్‌టాప్ ఆర్డ‌ర్ చేశాడు. ఆ ఆర్డ‌ర్‌ను డెలివ‌రీ ఎగ్జిక్యూటివ్ డెలివ‌రీ చేశాడు. య‌శ‌స్వి తండ్రి ఆ ఆర్డ‌ర్‌ను ఓపెన్ చేయ‌గా ల్యాప్‌టాప్‌కు బదులుగా బ‌ట్ట‌లు స‌బ్బులు ద‌ర్శ‌న‌మిచ్చాయి. దీంతో షాక్‌కు గురైన తండ్రి కుమారుడు శ‌ర్మ‌కు స‌మాచారం అందించాడు.

ఇక శ‌ర్మ ఫ్లిప్‌కార్ట్ తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. డెలివ‌రీ ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్‌ను డెలివ‌రీ చేసిన దృశ్యాల‌తో పాటు ఇత‌ర వివ‌రాల‌ను ఫ్లిప్‌కార్ట్‌కు ఆన్‌లైన్‌లో స‌మ‌ర్పించాడు. త‌మ‌దే త‌ప్ప‌ని ఫ్లిప్‌కార్ట్ యాజ‌మాన్యం ఒప్పుకుంది. 4 ప‌ని దినాల్లో మీ న‌గ‌దును రీఫండ్ చేస్తామ‌ని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఓటీపీ షేర్ చేసే కంటే ముందే డెలివ‌రీని ఓపెన్ చేసి చూడాల‌ని, ఇది డెలివ‌రీ ఎగ్జిక్యూటివ్ చెప్పాల‌ని శ‌ర్మ త‌న పోస్టులో పేర్కొన్నాడు. ఇది తెలియ‌క చాలా మంది మోస‌పోతున్నామ‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

Updated On 28 Sep 2022 2:34 AM GMT
subbareddy

subbareddy

Next Story