Thursday, March 23, 2023
More
    Homelatestలీడర్ బతుకంతా.. బిల్డప్ లే: MLC తక్కళ్లపల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

    లీడర్ బతుకంతా.. బిల్డప్ లే: MLC తక్కళ్లపల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

    విధాత: లీడర్ బతుకంతా పై మెరుగుల బిల్డప్ లేనని.. కడుపు చీల్చితే వారిలో పుట్టెడు దుఃఖమే కనిపిస్తుందని నాయకుల గోస వివరిస్తూ జోగులాంబ గద్వాల జిల్లా బిఆర్ఎస్ ఇన్చార్జి ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు చేసిన వ్యాఖ్యలు గులాబీ శ్రేణుల్లో చర్చనీయాంశమయ్యాయి. పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ..

    ‘ఈ గంజి బట్టలు వేసుకోవడానికి ఎంత అవుతుందని అనుకుంటున్నారని.. ఈ గంజి బట్టలు.. లెనిన్ కాటన్ బట్టలు వేసి ZPTC అయినం.. MPTC అయినమని, ఒక కారు కొనుక్కొని బిల్డప్ మెయింటైన్ చేయాలి. ఓ ఫోన్ ఉండాలి.. లేకపోతే ఎవరూ రారు.. వాళ్ల దగ్గర దరిద్రం తాండవిస్తుందంటే జనం ఎవరు రారు.. ఉన్నట్లుగా బిల్డప్ ఇయ్యాలి.. కాపాడుకోవాలి.. ఇల్లు మంచిగా ఉండాలి.. భార్య ఒంటి మీద బంగారం ఉండాలి, బట్టలు ఉండాలి.. పిల్లలను మంచిగా చదివించుకోవాలి. కారు ఉండాలి.. ఈ ఖదర్ కనుక స్టేజి మీద ఉన్న వాళ్లు మెయింటైన్ చేస్తే ఇవ్వాళ నాయకులుగా చలామణి అవుతారు.. జనం వస్తారు.. మా నాయకుడు అన్న ఫీలింగ్ వారికి ఉంటదని’ తక్కళ్ళపల్లి అన్నారు.

    అయితే నాయకుల కడుపులోని బాధను కనుక చీల్చితే పుట్టెడు దుఃఖం ఉంటది.. నీకు ఎట్లా ఎల్తుందని తలుపేసి అడిగితే బోరున ఏడ్చి కౌగిలించుకొని అన్నా అని పెడబొబ్బలు పెట్టాలని.. అన్ని బాధలుంటాయి అన్నారు. జనంలో గ్రామీణ, మండల నాయకులు పైకి ఎట్లుండాలనో.. లోపట వారికి ఎంత గోస ఉంటుందో చెప్పకనే చెప్పిన తక్కళ్లపల్లి వాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

    నిజానికి మండలాల్లో, పంచాయతీలలో పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చేసిన పనులకు బిల్లులు రాక, ప్రభుత్వం నుంచి నేరుగా గ్రామాల్లో పనులకు నిధులు మంజూరు కాక అప్పుల పాలవుతూ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకు పోతున్నారు. అయినా లీడర్ అన్న ట్యాగ్‌తో పైకి బిల్డప్ ఇస్తూ జనంలో తిరగడం వారికి అలవాటుగా మారిపోతుంది. ఈ నేపథ్యంలో తక్కళ్లపల్లి వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular