Tuesday, January 31, 2023
More
  Homehealthనిమ్మ‌, తేనె నీరు తాగుతున్నారా! వీరికి మంచిది కాద‌ట‌..?

  నిమ్మ‌, తేనె నీరు తాగుతున్నారా! వీరికి మంచిది కాద‌ట‌..?

  విధాత‌: ఈ మధ్య కాలంలో చాలామంది బరువు తగ్గేందుకు దగ్గరి దారుల గురించే వెతుకుతున్నారు. ఇలా బరువు తగ్గించే పదార్థాలలో ముందుగా వినిపించేవి నిమ్మకాయలు, తేనె గురించే. చాలా మంది బరువు తగ్గడం కోసం ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నిమ్మరసంలో తేనె కలిపి తాగుతుంటారు.

  ఇది చాలా మంచి అలవాటుగా ప్రాచుర్యంలో కూడా ఉంది. చలికాలంలో వెచ్చగా టీ కాఫీలకు బదులుగా ఇది తాగడం నిజంగా ఒక మంచి ఫీల్ కూడా. అయితే దీనితో నిజంగా అందరికీ మేలే జరుగుతుందా? అని అడిగితే నిపుణులు అవును అని అనడం లేదు.

  గురుగావ్‌కు చెందిన పరాస్ హాస్పిటల్‌కు చెందిన డైటీషియన్ డాక్టర్ నేహా పఠానియా దీని గురించి కొన్ని విషయాలు వివరించారు అవేమిటో తెలుసుకుంటే ఈ పానీయం ఎంతవరకు ఆరోగ్యకరం, ఎవరికి ఆరోగ్యకరం అనేది కొంత అర్థం అవుతుంది.

  మొదటి పానీయంగా తేనె?

  పొద్దున్నే తేనె మొదటి పానీయంగా తీసుకుంటే రోజంతా శక్తినిచ్చే బూస్టర్‌గా పనిచేస్తుంది. పడుకునే ముందు ఒక టేబుల్ స్పూన్ తేనే ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా ఉపకరిస్తుంది. అంతేకాదు జీర్ణ వ్యవస్థ పనితీరు మేరుగవుతుంది. శరీరం, మనసు విశ్రాంతి తీసుకునేందుకు దోహదం చేస్తుంది. తేనే ప్రకృతి ప్రసాదించే అమృతం వంటిది. శరీరంలోని డీటాక్సిఫికెంట్ కూడా.

  తేనెతో నిమ్మకాయ కలిసినపుడు?

  1. తేనె నిమ్మకాయ రెండూ కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండేవే. శరీరం ప్రీ రాడికల్స్‌తో పోరాడేందుకు శరీరానికి శక్తిని ఇస్తాయి. అందుకే ప్రతి రోజు కొద్దిగా నిమ్మరసం, తేనె గ్లాసు గోరువెచ్చని నీటితో తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు సలహా ఇస్తుంటారు.

  2. నిమ్మరసం, తేనె కలిసినపుడు మంచి ఫ్యాట్ బర్నర్‌గా మారుతుంది. మంచి మార్నింగ్ డ్రింక్ ఇది. గ్లాసు గోరు వెచ్చని నీటిలో కొన్ని చుక్కల తేనె, ఒక టీ స్పూన్ నిమ్మరసం తాగాలి. జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఫలితంగా కొవ్వు కరుగుతుంది.

  ఎలా తీసుకోవాలి?

  తేనె, నిమ్మరసం తయారుచేసుకునే నీళ్లు చాలా వేడిగా ఉండకూడదు. 200 నుంచి 250 మి.లీ. నిమ్మకాయ, తేనె కలిపిన నీటిని తాగాలి. నెమ్మదిగా రుచి ఆస్వాదిస్తూ తాగాలి. రెండు నెలల పాటు క్రమం తప్పకుండా తాగితే తప్పకుండా మంచి ఫలితాలు కనిపిస్తాయి. పొట్ట, నడుము చుట్టూ ఉన్న కొవ్వు కరగడం ప్రారంభం అవుతుంది.

  అందరికీ మంచిదేనా?

  కడుపులో అల్సర్లు, అసిడిటీతో బాధపడేవారు ఖాళీ కడుపుతో తెనె నిమ్మరసం తీసుకుంటే కడుపులో మంట రావచ్చు. ఇలా మంటగా అనిపించినా లేక కడుపులో నొప్పి వచ్చినా ఈ పానీయం మీకు సరిపడదని అర్థం.

  తేనెలోని ఫ్రక్టోజ్ కారణంగా తేనె నిమ్మకాయ రసం డయాబెటిక్స్‌కి అంత మంచిది కాదనే చెప్పాలి. దీని వల్ల షుగర్ పెరిగిపోవచ్చు.

  బరువు తగ్గేందుకు బెరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న వారు తెనే లేదా ఫ్రక్టోజ్ ఉండే పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు. ఇది డంపింగ్ సిండ్రోమ్ కు కారణం కావచ్చు.

  ఆరోగ్యకరమైన శరీర బరువు మెయింటెయిన్ చెయ్యడానికి చక్కెరలు, ఉప్పు కలిగిన పదార్థాలను చాలా పరిమితంగా తీసుకోవడం మంచిదని నిపుణుల సలహా.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular