Lemon tea | పొద్దున్న నిద్రలేవనగానే కప్పు టీ తాగందే చాలా మందికి తమ పనులు మొదలుపెట్టరు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అనేక రకాల టీలు తాగుతూ ఉంటారు. ఇందులో లెమన్ కీలకమైంది. లెమన్ టీ చేయడానికి బ్లాక్ టీలో కొద్దిగా నిమ్మరసం, రుచి కోసం చక్కెర, సుగంధ ద్రవ్యాలు సైతం వేసుకోవచ్చు. పశ్చిమ బెంగాల్ సహా భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో లెమన్‌ టీకి నల్ల ఉప్పును కలిపి తాగుతుంటారు. నిమ్మకాయ టీలో రోగనిరోధక శక్తిని పెంచడానికి […]

Lemon tea | పొద్దున్న నిద్రలేవనగానే కప్పు టీ తాగందే చాలా మందికి తమ పనులు మొదలుపెట్టరు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అనేక రకాల టీలు తాగుతూ ఉంటారు. ఇందులో లెమన్ కీలకమైంది. లెమన్ టీ చేయడానికి బ్లాక్ టీలో కొద్దిగా నిమ్మరసం, రుచి కోసం చక్కెర, సుగంధ ద్రవ్యాలు సైతం వేసుకోవచ్చు. పశ్చిమ బెంగాల్ సహా భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో లెమన్‌ టీకి నల్ల ఉప్పును కలిపి తాగుతుంటారు. నిమ్మకాయ టీలో రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ సీ, విటమిన్ బీ6, పొటాషియం, మెగ్నీషియం తదితర పోషకాలుంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని మరింత బలోపేతం చేయడానికి సహాయపడతాయి.

అలెర్జీలు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో ముఖ్య భూమికను పోషిస్తాయి. టీ ఆకుల్లో ఫ్లేవనాయిడ్స్‌, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. నిమ్మకాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. మొటిమలు, తామర వంటి చర్మ వ్యాధులను నియంత్రించడంలో లెమన్‌ టీ సహాయపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉంచడంతో పాటు బరువును నియంత్రించడానికి సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. ఒత్తిడిని తగ్గించేందుకు లెమన్‌ టీలో ఫ్లేవనాయిడ్లు, పొటాషియం, మెగ్నీషియం, జింక్, రాగి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. కప్పు నిమ్మ టీ మీ మానసిక స్థితిని మెరుగుపరిచేందుకు, ఒత్తిడిని తగ్గించి ఎక్కువ విశ్రాంతి ఇవ్వడానికి సహాయపడుతుంది.

Updated On 7 Jan 2023 5:49 AM GMT
cm

cm

Next Story