Viral Video | చిరుత పులులు భ‌యంక‌రంగా దాడి చేస్తాయి. చిరుత‌ల కంటికి ఇత‌ర జంతువులు, మ‌న‌షులు క‌న‌బ‌డితే వ‌ద‌ల‌నే వ‌ద‌ల‌వు. దాడి చేసి మ‌ట్టుబెడుతాయి. అంత భ‌యంక‌ర‌మైన‌వి చిరుత పులులు. ఓ చిరుత అతి వేగంతో కంచె దూకి.. రోడ్డుపై వెళ్తున్న కారుపై దాడి చేసి ప‌రుగెత్తింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. అసోం జోర్హాట్‌లోని రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ సెంట‌ర్‌లోకి ఓ చిరుత పులి ప్ర‌వేశించింది. రీసెర్చ్ సెంట‌ర్ నివాసితులో […]

Viral Video | చిరుత పులులు భ‌యంక‌రంగా దాడి చేస్తాయి. చిరుత‌ల కంటికి ఇత‌ర జంతువులు, మ‌న‌షులు క‌న‌బ‌డితే వ‌ద‌ల‌నే వ‌ద‌ల‌వు. దాడి చేసి మ‌ట్టుబెడుతాయి. అంత భ‌యంక‌ర‌మైన‌వి చిరుత పులులు. ఓ చిరుత అతి వేగంతో కంచె దూకి.. రోడ్డుపై వెళ్తున్న కారుపై దాడి చేసి ప‌రుగెత్తింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

అసోం జోర్హాట్‌లోని రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ సెంట‌ర్‌లోకి ఓ చిరుత పులి ప్ర‌వేశించింది. రీసెర్చ్ సెంట‌ర్ నివాసితులో పాటు స‌మీప ప్రాంతాల్లోని మ‌హిళ‌లు, చిన్నారుల‌పై చిరుత దాడి చేసింది. ఆ క్రూర మృగం దాడిలో దాదాపు 15 మంది గాయ‌ప‌డ్డారు. వారంతా ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే రీసెర్చ్ సెంట‌ర్‌లో ఓ కంచె పైనుంచి దూకి, రోడ్డుపై వెళ్తున్న వాహ‌నంపై దాడి చేసింది. అనంత‌రం పరుగెత్తింది చిరుత‌.

ఈ సంద‌ర్భంగా అట‌వీ శాఖ అధికారి మాట్లాడుతూ.. ఆహారం కోస‌మే స‌మీప అట‌వీ ప్రాంతం నుంచి రీసెర్చ్ సెంట‌ర్‌లోకి ప్ర‌వేశించి ఉండొచ్చ‌ని తెలిపారు. చిరుత‌ను బంధించేందుకు అన్ని ర‌కాలు ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలిపారు. మ‌హిళ‌లు, చిన్నారులు, వృద్ధులు ఇండ్ల‌కే ప‌రిమితం కావాల‌ని, బ‌య‌ట‌కు రావొద్ద‌ని సూచించారు.

Updated On 28 Dec 2022 11:43 AM GMT
subbareddy

subbareddy

Next Story