విధాత : చిరుత పేరు విన‌గానే హ‌డ‌లిపోతాం. ఒక వేళ ఆ చిరుత మ‌న మీద దాడి చేస్తే ఊపిరి ఆగిపోవాల్సిందే. ఓ యువ‌కుడు సైకిల్‌పై వెళ్తుండ‌గా.. చిరుత దాడి చేసింది. మ‌ళ్లీ క్ష‌ణాల్లోనే ఆ చిరుత అడ‌విలోకి పారిపోయింది. ఈ ఘ‌ట‌న అసోంలోని క‌జిరంగా నేష‌న‌ల్ పార్కులో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. క‌జిరంగా నేష‌న‌ల్ పార్కులోని ఓ ర‌హ‌దారి గుండా ఓ యువ‌కుడు సైకిల్‌పై వెళ్తున్నాడు. కార్లు కూడా వేగంగా దూసుకెళ్తున్నాయి. అయితే రోడ్డు […]

విధాత : చిరుత పేరు విన‌గానే హ‌డ‌లిపోతాం. ఒక వేళ ఆ చిరుత మ‌న మీద దాడి చేస్తే ఊపిరి ఆగిపోవాల్సిందే. ఓ యువ‌కుడు సైకిల్‌పై వెళ్తుండ‌గా.. చిరుత దాడి చేసింది. మ‌ళ్లీ క్ష‌ణాల్లోనే ఆ చిరుత అడ‌విలోకి పారిపోయింది. ఈ ఘ‌ట‌న అసోంలోని క‌జిరంగా నేష‌న‌ల్ పార్కులో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. క‌జిరంగా నేష‌న‌ల్ పార్కులోని ఓ ర‌హ‌దారి గుండా ఓ యువ‌కుడు సైకిల్‌పై వెళ్తున్నాడు. కార్లు కూడా వేగంగా దూసుకెళ్తున్నాయి. అయితే రోడ్డు ప‌క్క‌న ఉన్న చెట్ల పొద‌ల్లో మాటు వేసిన చిరుత పులి.. సైకిల్‌పై వెళ్తున్న యువ‌కుడిపై దాడి చేసింది. అత‌ని న‌డుమును ఒక్క‌సారిగా ప‌ట్టేసింది. అప్పుడే ఓ రెడ్ క‌ల‌ర్ కారు కూడా వేగంగా రావ‌డంతో ఆ శ‌బ్దానికి చిరుత క్ష‌ణాల్లోనే అడ‌విలోకి తిరిగి పారిపోయింది.

యువ‌కుడు కింద ప‌డిపోయాడు. అదే దారిలో సైకిల్ పై వెళ్తున్న మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తులు కూడా ఆ యువ‌కుడిని చూసి ఆగిపోయారు. మొత్తంగా చిరుత దాడి నుంచి ఆ యువ‌కుడు త‌ప్పించుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ ఆఫీస‌ర్ సుశాంత నంద ట్విట్ట‌ర్‌లో షేర్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. నిమిషం నిడివి గ‌ల ఈ వీడియోను 2.5 ల‌క్ష‌ల మంది వీక్షించ‌గా, 8 వేల మంది లైక్ చేశారు.

Updated On 22 Sep 2022 1:33 PM GMT
subbareddy

subbareddy

Next Story