విధాత: లైగర్ (Liger) సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తమను ఆదుకోవాలని శుక్రవారం ఫీలిమ్ ఛాంబర్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నైజాం ఏరియాలో 82 మంది 9 కోట్ల మేరకు నష్టపోయామంటూ తమను ఆదుకోవాలని కోరుతూ ఆందోళనకు దిగారు.
తమకు డబ్బులు చెల్లించాల్సిన నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనివాస్ కూడా నష్టపోవడంతో ఆయన ఇచ్చే పరిస్థితి లేదని తమను దర్శక నిర్మాతలు చార్మి, పూరి జగన్నాథ్, హీరో విజయ్ లు ఆదుకోవాలని వారు కోరారు.
అలాగే తమకు జవాబుదారీ అయిన డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ విదేశాలకు పారిపోయే అవకాశం ఉందంటూ అతడిని ఆపాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే.. ఆందోళన విషయం తెలుసుకున్న చార్మి వారిని ఆదుకుంటామంటూ మెయిల్ సందేశం పంపారు. లెగర్ సినిమాకు 110 కోట్లకు పైగా ఖర్చు అయిందని 60 కోట్ల మేరకు మాత్రమే రాబట్టిందను, దీంతో భారీగా నష్టపోయినట్లు ఎగ్జిబ్యూటర్లు, డిస్టిబ్యూటర్లు వాపోయారు.