విధాత: ఇలాంటి ప్రేమ‌ క‌థ‌ను మీరు విని ఉండ‌రు. చూసి కూడా ఉండ‌రు. అలాంటిది ఈ ప్రేమ క‌థ‌ మరి. ఓ అమ్మాయితో ల‌వ్‌లో ప‌డ్డ మ‌హిళా ఉపాధ్యాయురాలు.. ఏకంగా ఆమెను పెళ్లి చేసుకునేందుకు లింగ‌ మార్పిడి చేయించుకుంది. మ‌గాడిగా మారిన త‌ర్వాత పెద్ద‌ల అనుమ‌తితో మూడు ముళ్లు, ఏడు అడుగుల‌తో ఏక‌మ‌య్యారు. ఈ ప్రేమ క‌థ గురించి తెలుసుకోవాలంటే రాజ‌స్థాన్‌లోని భ‌ర‌త్‌పూర్ వెళ్లాల్సిందే. వివ‌రాల్లోకి వెళ్తే.. మీరా అనే ఓ మ‌హిళ‌.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఫిజిక‌ల్ […]

విధాత: ఇలాంటి ప్రేమ‌ క‌థ‌ను మీరు విని ఉండ‌రు. చూసి కూడా ఉండ‌రు. అలాంటిది ఈ ప్రేమ క‌థ‌ మరి. ఓ అమ్మాయితో ల‌వ్‌లో ప‌డ్డ మ‌హిళా ఉపాధ్యాయురాలు.. ఏకంగా ఆమెను పెళ్లి చేసుకునేందుకు లింగ‌ మార్పిడి చేయించుకుంది.

మ‌గాడిగా మారిన త‌ర్వాత పెద్ద‌ల అనుమ‌తితో మూడు ముళ్లు, ఏడు అడుగుల‌తో ఏక‌మ‌య్యారు. ఈ ప్రేమ క‌థ గురించి తెలుసుకోవాలంటే రాజ‌స్థాన్‌లోని భ‌ర‌త్‌పూర్ వెళ్లాల్సిందే. వివ‌రాల్లోకి వెళ్తే.. మీరా అనే ఓ మ‌హిళ‌.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఫిజిక‌ల్ డైరెక్ట‌ర్ టీచ‌ర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తోంది.

అయితే ఆమె త‌న స్టూడెంట్ క‌ల్ప‌న‌కు ప్ర‌తి రోజు క‌బ‌డ్డీ నేర్పించేది. ఈ క్ర‌మంలో క‌ల్ప‌న‌పై టీచ‌ర్ మ‌నసు పారేసుకుంది. ఆ అమ్మాయిని ప్రేమించాల‌నుకుంది. పెళ్లి చేసుకోవాల‌నుకుంది. 2016 నుంచి రెండేండ్ల పాటు క‌ల్ప‌న‌ను ప్రేమిస్తూనే ఉంది టీచ‌ర్. ఒంట‌రి ప్రేమ‌ను చంపుకోలేక 2018లో మీరా.. క‌ల్ప‌న‌కు ల‌వ్ ప్ర‌పోజ్ చేసింది. క‌ల్ప‌న ఒక్క క్ష‌ణం కూడా ఆలోచించ‌కుండా టీచ‌ర్ ప్రేమ‌కు ఒకే చెప్పేసింది.

కానీ ఇద్ద‌రిది ఒకే జెండ‌ర్ కావ‌డంతో.. వీరి వివాహానికి పెద్ద‌లు ఒప్పుకోర‌ని భావించారు. దీంతో టీచ‌ర్ మీరా లింగ‌మార్పిడి చేయించుకుని మ‌గాడిలా మారింది. స‌ర్జ‌రీ చేయించుకుంది. ఆ త‌ర్వాత మీరా పేరును వ‌దిలేసి ఆర‌వ్ కుంతాల్‌గా నామ‌క‌ర‌ణం చేసుకుంది. ఇరు కుటుంబాల అంగీక‌రంతో వీరిద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. 2019 డిసెంబ‌ర్‌లో మీరా తొలి స‌ర్జ‌రీ చేయించుకున్న‌ది.

ఈ సంద‌ర్భంగా క‌ల్ప‌న మాట్లాడుతూ.. ఆర‌వ్‌ను ముందు నుంచే ప్రేమిస్తున్నాన‌ని, ఒక‌వేళ అత‌ను స‌ర్జ‌రీ చేయించుకోకున్నా.. నేను అత‌న్నే పెళ్లి చేసుకునేదాన్ని అని క‌ల్ప‌న పేర్కొన్న‌ది. స‌ర్జ‌రీ స‌మ‌యంలో ఆర‌వ్‌తోనే ఉన్న‌ట్లు క‌ల్ప‌న‌ చెప్పింది.

Updated On 10 Nov 2022 4:43 PM GMT
krs

krs

Next Story