విధాత: ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో సంచ‌ల‌నాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. లిక్క‌ర్ స్కాంలో హైద‌రాబాద్ బేగంపేట విమానాశ్ర‌యం పాత్ర ప్ర‌ధానంగా ఉన్న‌ట్లు ద‌ర్యాప్తు సంస్థ‌లో విచార‌ణ‌లో తేలినట్లు తెలుస్తున్న‌ది. బేగంపేట విమానాశ్ర‌యంలో స్క్రీనింగ్ లేక‌పోవ‌టం, ప్రైవేటు సెక్యూరిటీ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉండ‌టంతో నేరుగా రన్ వే పైకి వీఐపీల వాహనాలు వెళ్లే సదుపాయం ఉండడంతో ఈ విమానాశ్ర‌యం ద్వారానే ఢిల్లీకి ప్రైవేట్ చార్టెడ్ విమానాల ద్వారా డ‌బ్బును త‌ర‌లించిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఈ స్పెష‌ల్ ఫ్లైట్ స‌ర్వీసులు అందిస్తున్న‌ది జెట్ సెట్‌గో […]

విధాత: ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో సంచ‌ల‌నాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. లిక్క‌ర్ స్కాంలో హైద‌రాబాద్ బేగంపేట విమానాశ్ర‌యం పాత్ర ప్ర‌ధానంగా ఉన్న‌ట్లు ద‌ర్యాప్తు సంస్థ‌లో విచార‌ణ‌లో తేలినట్లు తెలుస్తున్న‌ది. బేగంపేట విమానాశ్ర‌యంలో స్క్రీనింగ్ లేక‌పోవ‌టం, ప్రైవేటు సెక్యూరిటీ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉండ‌టంతో నేరుగా రన్ వే పైకి వీఐపీల వాహనాలు వెళ్లే సదుపాయం ఉండడంతో ఈ విమానాశ్ర‌యం ద్వారానే ఢిల్లీకి ప్రైవేట్ చార్టెడ్ విమానాల ద్వారా డ‌బ్బును త‌ర‌లించిన‌ట్లు తెలుస్తున్న‌ది.

ఈ స్పెష‌ల్ ఫ్లైట్ స‌ర్వీసులు అందిస్తున్న‌ది జెట్ సెట్‌గో సంస్థ‌. ఈ సంస్థ సీఈఓ విజ‌య‌సాయిరెడ్డి అల్లుడి వ‌దిన క‌నికారెడ్డి కావ‌టం గ‌మ‌నార్హం. ఈమె అర‌బిందో ఫార్మా డైరెక్ట‌ర్ శ‌ర‌త్ భార్య‌. అయితే ఈ స్పెష‌ల్‌ ప్లైట్ల‌లో ఢిల్లీకి ఎవ‌రెవ‌రు వెళ్లారు, ఎన్ని సార్లు వెళ్లారో ఈడీ ఆధారాలు సేక‌రించింది. ఈ క్ర‌మాన్ని బ‌ట్టి చూస్తే.. రాష్ట్రంలోని ప్ర‌ముఖులు చాలామందికి లిక్క‌ర్ కుంభ‌కోణం లింకులు బ‌య‌టకు వ‌చ్చే అవ‌కాశాలున్న‌ట్లు అధికార వ‌ర్గాల భోగ‌ట్టా.

అయితే ఇప్పటికే దర్యాప్తు సంస్థల వద్ద అత్యంత కీలక ఆధారాలున్నాయని, అతి త్వరలోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖుల అరెస్టులు ఉండవచ్చని ఉహాగానాలు అధికమయ్యాయి. మరోవైపు జెట్ సెట్‌గో సంస్థ సీఈవో కనికా రెడ్డికి అభిషేక్ బోయినపల్లికి దగ్గర సంబంధాలు ఉన్నట్లు ఈడీ భావిస్తున్నది.! ఇప్పటికే సంస్థ కార్యకలాపాలు, లావాదేవీల డేటాను ఈడీ సేకరించింది. తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతల అండతోనే లిక్కర్ స్కామ్ జరిగినట్టుగా ఈడీ భావిస్తున్నది.

జెట్ సెట్‌గో సంస్థ వివరాలపై దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. ఈ క్రమంలో సంస్థ కార్యకలాపాల వివరాలు ఇవ్వాలంటూ ఎయిర్ పోర్ట్స్ అథారిటీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లేఖ రాసింది. అలాగే ప్రయాణికుల వివరాల కోసం పలు ఎయిర్‌పోర్టుల డైరెక్టర్లకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ లేఖలు రాసింది.

Updated On 17 Nov 2022 3:40 AM GMT
krs

krs

Next Story