Little Girl | విధాత‌: పాములంటే చాలు.. భయం వేస్తుంది. అదే ఎదురుపడితే ఒళ్లు జలదరించిపోతుంది! అంతగా భయపెట్టే జీవులు పాములు. వాటిలో కొన్ని భయానక విషాన్ని కక్కేవీ ఉంటాయి. త్రాచుపాము, రక్త పింజర వంటి పాములు కాటేస్తే క్షణాల్లోనే ప్రాణాలు పోతాయి. సాధారణంగా ఈ సరీసృపాలు అటవీ ప్రాంతాల్లో ఉంటాయి. కప్పలు, బల్లులు, ఎలుకల వంటి కీటకాలను వేటాడి తింటాయి. అయితే.. కొన్ని పాములను చూస్తే అబ్బ ఎంత అందంగా ఉన్నాయో అనిపించక మానదు. అలాంటి వాటిని […]

Little Girl | విధాత‌: పాములంటే చాలు.. భయం వేస్తుంది. అదే ఎదురుపడితే ఒళ్లు జలదరించిపోతుంది! అంతగా భయపెట్టే జీవులు పాములు. వాటిలో కొన్ని భయానక విషాన్ని కక్కేవీ ఉంటాయి. త్రాచుపాము, రక్త పింజర వంటి పాములు కాటేస్తే క్షణాల్లోనే ప్రాణాలు పోతాయి. సాధారణంగా ఈ సరీసృపాలు అటవీ ప్రాంతాల్లో ఉంటాయి. కప్పలు, బల్లులు, ఎలుకల వంటి కీటకాలను వేటాడి తింటాయి.

అయితే.. కొన్ని పాములను చూస్తే అబ్బ ఎంత అందంగా ఉన్నాయో అనిపించక మానదు. అలాంటి వాటిని కొందరు ఇండ్లల్లో పెంచుకుంటుంటారు. నిజానికి ఇది చాలా ప్రమాదకరం. అయినా కూడా కొందరు వాటిని పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఇంటిలో కుటుంబ సభ్యుల్లో తిరిగే పాముల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తరచూ కనిపిస్తూనే ఉంటాయి. ఈ ఇంట్లోవారు కూడా ఇలానే కొన్ని పాములను పెంచుకుంటున్నారు. వాటిలో కొన్ని కొండచిలువలు కూడా ఉన్నాయి.

అయితే.. ఈ వీడియో మాత్రం కొంత భయంగొల్పుతుంది. ఆ ఇంట్లో పెంచుకుంటున్న పాములు బెడ్‌పై ఒక చిన్నారిని చుట్టుకుంటే.. ఆ చిన్నారి కూడా వాటిని హత్తుకుని హాయిగా నిద్రపోతున్న వీడియో ఒకటి తాజాగా నెట్టింట హల్‌చల్‌ సృష్టించింది. దీనిని చూసిన కొందరు ముచ్చటపడితే.. మరికొందరు మాత్రం నివ్వెరపోయారు. ఆ వీడియోలో ఆ చిన్నారి ఆ పాములు అటూ ఇటూ పాకుతున్నా.. ఎలాంటి బెదురు లేకుండా హాయిగా వాటిని హత్తుకుని మరీ నిద్రపోయింది.

View this post on Instagram

A post shared by Ariana (@snakemasterexotics)

దీనికి చూసినవారికి పీడకలలు రావచ్చునేమోగానీ.. ఇది మాత్రం ఆ ఇంట్లో రోజూ జరిగేదేనట. అరియానా అనే ఆ పాప ఉన్న ఈ వీడియోను పోస్టు చేసినవారు.. దానికి అందమైన కామెంట్‌ను కూడా జతచేర్చారు. ‘ఆలింగనాల ఉత్సవం వచ్చేసింది.. అరియానా తిరుగులేని పాములు పట్టే అమ్మాయిగా మారిపోయి, జారుతూపోయే తన స్నేహితులకు తన బెడ్‌ను పంచింది. ఇది ఆలింగనాల పార్టీ.. అందరూ ఆహ్వానితులే. మీమీ ముద్దుముద్దు పాములతో ఈ సంతోషంలో భాగస్వాములు కండి.

అయితే.. మీక్కూడా కొంత స్సేస్‌ ఉండేలా చూసుకోండి..’ రాశారు. ఆరియానాకు పాములంటే చచ్చేంత ప్రేమ. అందుకే తను గతంలో కూడా రకరకాల పాములతో ఆడుకుంటున్న వీడియోలు ఎన్నింటినో షేర్‌ చేసింది. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్‌ వచ్చాయి. అయితే.. ఈ వీడియోపై ఆన్‌లైన్‌లో భిన్నస్పందనలు వెలువడ్డాయి. కొంతమంది ఇలాంటి చర్యలు ప్రాణాలతో చెలగాటమేనని కొందరు పేర్కొన్నారు. పాములు ఆట వస్తువులు కాదని గుర్తించాలని హితవు చెప్పారు. ఒక నెటిజన్‌.. తాను కలలో కూడా ఇది ఊహించలేనని పేర్కొన్నాడు.

Updated On 4 Sep 2023 10:57 AM GMT
somu

somu

Next Story