Lokesh |
విధాత: యువనేత లోకేష్ మళ్ళీ మంగళగిరిలో పోటీ చేయడం లేదా.. ఈసారి సేఫ్ నియోజకవర్గం కోసం చూస్తున్నారా.? మంగళగిరిలో మొన్నటి 2019 ఎన్నికల్లో ఆళ్ళ రామకృష్ణ రెడ్డి చేతిలో ఓడిపోయిన లోకేష్ మళ్ళీ అక్కడే పాటీ చేసి గెలుస్తానని గతంలో చెప్పారు. ఆ మేరకు ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేసి వైద్యశిబిరాలు, ఉచిత చికిత్సలు కూడా చేస్తూ ప్రజల్లో నిలవాలని.. మళ్ళీ గెలవాలని ఆశించారు.
కానీ తాజాగా జగన్ తీసుకున్న మెగా ఇళ్ల ప్రాజక్టు నిర్ణయంతో లోకేష్ మళ్ళీ అమరావతిలో పోటీ చేసేందుకు వెనుకాడుతున్నట్లు చెబుతున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో దాదాపు 51 వేల ఇళ్ల పట్టాలు పేదలకు ఇవ్వడం ద్వారా లోకేష్ మళ్ళీ అమరావతి పరిధిలోని మంగళగిరిలో అడుగు పెట్టడానికి భయపడేలా చేశారు.
ఒకేసారి దాదాపు 51 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు అంటే మాటలు కాదు. దాదాపుగా లక్షకు పైగా ఓట్లు జగన్ ఈ ఒక్క పథకంతో తన ఖాతాలో వేసుకున్నట్లు అయింది. పైగా ఆ ఇళ్ల జాగాలు అక్కడ ఇవ్వవద్దని టిడిపి సుప్రీం కోర్టుకు కూడా వెళ్ళింది.
అక్కడ అనుకూలంగా తీర్పు వచ్చాక జగన్ ఎకాఎకిన భారీగా స్థలాన్నికొని ఒక్కో సెంటు చూపిన పేదలకు ఇచ్చేనందుకు ఏర్పాట్లు చేయడం, ఇటు అమరావతి జేఏసీ పేరిట ఆ ఇళ్లను అడ్డుకునేందుకు ధర్నాలు చేయడం తెలిసింది.
ఏది ఏమైనా జగన్ ఇచ్చిన ఇళ్ల పట్టాల పథకం ఇపుడు లోకేష్ కు మళ్ళీ అమరావతి రావడానికి ఇబ్బందికరంగా మారింది. జగన్ అంత భారీగా ఇళ్ల జాగాలు ఇచ్చాక అక్కడ లోకేష్ గెలుపు దుర్లభం అని ముందే తెలుసుకున్న టిడిపి ఆయన్ను అక్కడ కాకుండా వేరేచోటనుంచి పోటీ చేసేందుకు చూస్తున్నారని అంటున్నారు.
అయితే.. దగ్గర్లోని పెదకూరపాడు లేదా కృష్ణ జిల్లాలోని పెడన నియోజకవర్గాలను లోకేష్ కోసం చూస్తున్నారని అంటున్నారు. ఇదిలా ఉండగా భారీగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని జగన్ మోహన్ రెడ్డి రేపు 26న మంగళగిరిలో ప్రారంభిస్తారు. దాదాపుగా 1400 ఎకరాల్లో 51,000 మందికి సెంటు చొప్పున ఇంటి జాగా అందజేస్తారు.