ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న పాద‌యాత్ర‌ విధాత‌: యువతలో ఉత్తేజం నింపుతూ పార్టీని బలోపేతం చేస్తూ దాదాపు 400 రోజుల్లో 4000 కిలోమీటర్ల పాదయాత్రకు లోకేష్ సిద్ధమయ్యారు. ఈనెల 27న కుప్పం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్రలో భాగంగా లోకేష్ దాదాపు 125 నియోజకవర్గాలు కవర్ చేస్తారు. గతంలో పాదయాత్రలు చేసిన చంద్రబాబు.. జగన్.. వైఎస్సార్ వంటివారంతా ముఖ్యమంత్రులు అయ్యారు. ఇప్పుడు లోకేష్ పాదయాత్రతో చంద్రబాబుకు మళ్ళీ అవకాశం వస్తుందా.. ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది చూడాలి. […]

  • ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న పాద‌యాత్ర‌

విధాత‌: యువతలో ఉత్తేజం నింపుతూ పార్టీని బలోపేతం చేస్తూ దాదాపు 400 రోజుల్లో 4000 కిలోమీటర్ల పాదయాత్రకు లోకేష్ సిద్ధమయ్యారు. ఈనెల 27న కుప్పం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్రలో భాగంగా లోకేష్ దాదాపు 125 నియోజకవర్గాలు కవర్ చేస్తారు.

గతంలో పాదయాత్రలు చేసిన చంద్రబాబు.. జగన్.. వైఎస్సార్ వంటివారంతా ముఖ్యమంత్రులు అయ్యారు. ఇప్పుడు లోకేష్ పాదయాత్రతో చంద్రబాబుకు మళ్ళీ అవకాశం వస్తుందా.. ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది చూడాలి.

వాస్తవానికి లోకేష్ గతంలో ఎమ్మెల్యేగా గెలవకుండానే నేరుగా ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రిగా పని చేసారు. తరువాత 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసినా ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు.

ఆనాటి నుంచి లోకేష్ ను వైఎస్సార్సీపీ నాయకులే కాకుండా సోషల్ మీడియా కుర్రాళ్ళు సైతం ఎన్నికల్లో ఓడిపోయారని ర్యాగింగ్ చేస్తున్నారు. ఈ సారైనా ఎలాగైనా గెలిచే ఉద్దేశంతో లోకేష్ యాత్రకు దిగారు. యువత.. ఉపాధి.. ఉద్యోగాల కల్పన వంటి అంశాలు ప్రధానాంశాలుగా ఆయన జనంలోకి వెళ్తున్నారు.

మీడియా సిద్ధం!

లోకేష్ యాత్రకు సంబంధించి ప్రచారం.. బ్రాండింగ్ ప్రజల్లో ఊపు తేవడానికి మీడియాపరంగా ఎలాంటి ప్లాన్స్ వేయాలన్నదాని గురించి లోకేష్.. ఇతర పార్టీ సీనియర్లు టివి5, ఇతర ఛానల్స్ పెద్దలతో చర్చించారు.

బీఆర్ నాయుడు.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వంటి చానెళ్లు లోకేష్ యాత్రకు విస్తృత కవరేజ్ ఎలాగూ ఇస్తాయి. అంతే కాకుండా యాత్రలో లోకేష్ ఎవరితో ఎలా మాట్లాడాలి.. ఏఏ అంశాలు ప్రస్తావించాలి అనే పాయింట్స్ మీద ఫీడింగ్ ఇవ్వడానికి ఛానెల్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి.

ఇదిలా ఉండగా లోకేష్ యాత్రకు ఇంకా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దాదాపు ఇరవై రోజుల క్రిందటే కలెక్టర్.. ఎస్పీ ఇతర అధికారులకు టిడిపి నుంచి ఈ పాదయాత్రకు సంబంధించి అనుమతులు కోరుతూ దరఖాస్తు చేసినా అట్నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదని టిడిపి ఆరోపిస్తోంది. దీంతో డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డికి టిడిపి లేఖ రాసింది.

Updated On 21 Jan 2023 3:02 AM GMT
krs

krs

Next Story