Road Accident | మధ్యప్రదేశ్‌ సిధి జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. మొహానియా టన్నెల్ సమీపంలో ట్రక్కు ఢీకొనడంతో మూడు బస్సులు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. మరో 50 మందికి గాయాలయ్యాయని రెవా ఎస్పీ ముఖేశ్‌ శ్రీవాస్తవ తెలిపారు. ఇందులో 15 నుంచి 20 మంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. మరో వైపు విషయం తెలుసుకున్న మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఘటనా స్థలాన్ని, […]

Road Accident | మధ్యప్రదేశ్‌ సిధి జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. మొహానియా టన్నెల్ సమీపంలో ట్రక్కు ఢీకొనడంతో మూడు బస్సులు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. మరో 50 మందికి గాయాలయ్యాయని రెవా ఎస్పీ ముఖేశ్‌ శ్రీవాస్తవ తెలిపారు. ఇందులో 15 నుంచి 20 మంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. మరో వైపు విషయం తెలుసుకున్న మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఘటనా స్థలాన్ని, ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు.

ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10లక్షలు, గాయపడ్డవారికి రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల బంధువులకు వారి అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. రేవా - సిధి సొరంగం సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. వేగంగా వస్తున్న లారీ టైర్‌ పగిలిపోవడంతో ఆగిఉన్న మూడు బస్సులను ఢీకొట్టింది. రెండు బస్సులు బోల్తాపడగా.. మరో బస్సు నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందినట్లు సమాచారం.

సంఘటనా స్థలం క్షతగాత్రుల హాహాకారాలు, రక్తపుమరకలతో భయానకరంగా మారింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారిని రేవా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనలో 52 మంది గాయపడ్డారని, ట్రక్కు కింద మరికొంత మంది చిక్కుకొని ఉండవచ్చని స్థానికులు తెలిపారు. బస్సులోని వారంతా సాత్నాలో అమిత్‌షా కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు మాచారం. సాత్నాలోని కోల్ తెగకు చెందిన షబ్రీ పండుగకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సాయంత్రం 5.30 గంటలకు కార్యక్రమం ముగిసినట్లు సమాచారం.

సాత్నా నుంచి రాంపూర్ బఘేలాన్, రేవా మీదుగా, మొహానియా నేరుగా సొరంగం మీదుగా వెళుతోంది. సొరంగానికి కిలోమీటర్‌ దూరంలో సిద్ధి జిల్లాలోని చుర్హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్ఖాడా గ్రామం సమీపంలో మూడు బస్సులు కొద్దిసేపు ఆపారు. ఈ క్రమంలోనే లారీ టైరు పేలిపోయి.. బస్సులను ఢీకొట్టింది. ఇందులో రెండు బస్సులు బోల్తాపడ్డ బస్సులోని వారికి గాయాలు కాగా.. ఢీకొట్టిన బస్సులు 14 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రేవాలోని సంజయ్ గాంధీ మెడికల్ కాలేజీకి పంపించారు. సహాయ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Updated On 25 Feb 2023 2:54 AM GMT
Vineela

Vineela

Next Story