Bhupalpally | శిశువుకు మహాలక్ష్మిగా నామకరణం చేసిన మంత్రి సత్యవతిరాథోడ్ విధాత: పొరుగున ఉన్న మహారాష్ర్టలో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడం, మాతాశిశు మరణాలు అధికంగా ఉంటున్న పరిస్థితుల్లో ఆ రాష్ట్ర మహిళలు పొరుగున ఉన్న తెలంగాణ జిల్లాల ఆసుపత్రులకు ప్రసవాలకు వస్తున్నారు. ఈ క్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం ఏరియా ఆసుపత్రిలో నవజాత శిశువుల ప్రత్యేక కేర్ సెంటర్‌లో మహారాష్ట్ర నుంచి చాందిని అనే మహిళ డెలివరి కోసం వచ్చి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. […]

Bhupalpally |
శిశువుకు మహాలక్ష్మిగా నామకరణం చేసిన మంత్రి సత్యవతిరాథోడ్
విధాత: పొరుగున ఉన్న మహారాష్ర్టలో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడం, మాతాశిశు మరణాలు అధికంగా ఉంటున్న పరిస్థితుల్లో ఆ రాష్ట్ర మహిళలు పొరుగున ఉన్న తెలంగాణ జిల్లాల ఆసుపత్రులకు ప్రసవాలకు వస్తున్నారు.
ఈ క్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం ఏరియా ఆసుపత్రిలో నవజాత శిశువుల ప్రత్యేక కేర్ సెంటర్‌లో మహారాష్ట్ర నుంచి చాందిని అనే మహిళ డెలివరి కోసం వచ్చి ఆడ శిశువుకు జన్మనిచ్చింది.
కేర్ సెంటర్ సందర్శనకు వచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్ చాందినిని పరామర్శించి ఆసుపత్రిలో వసతులపై ఆరాతీశారు. ఇక్కడ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, తనకు నార్మల్ డెలివరీ అయిందని చాందిని తెలిపారు.
తన బిడ్డకు పేరు పెట్టాలని ఆమె మంత్రిని కోరగా, మహాలక్ష్మిగా నామకరణం చేశారు. మెరుగైన వైద్య సేవలందిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా చాందిని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
