HomelatestMahendra Nath Pandey | హామీల అమలులో KCR విఫలం: కేంద్ర మంత్రి పాండే ధ్వజం

Mahendra Nath Pandey | హామీల అమలులో KCR విఫలం: కేంద్ర మంత్రి పాండే ధ్వజం

Mahendra Nath Pandey

విధాత: తెలంగాణా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు లో సిఎం కేసిఆర్ విఫలమయ్యారని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాధ్ పాండే ఆరోపించారు. సోమవారం మిర్యాగూడ పట్టణం విఘ్నేశ్వర ఎస్టేట్ జరిగిన నల్లగొండ పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా ముఖ్య ఓటర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

నీళ్లు, నిధులు, నియామకాలు సాధిస్తామని చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని, నేడు వాటిని తుంగలో తొక్కారని ఆరోపించారు. దళిత బంధు పూర్తి స్థాయిలో అమలు లేదని, గిరిజన బంధు లేదని, మూడెకరాలు లేదన్నారు. గిరిజనులు ఆడపిల్లలు అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజల కలలు కల్లలు చేశారని, అబద్ధాలతో కాలయాపన చేస్తున్నారన్నారు. కుటుంబ, అవినీతి కెసిఆర్ పాలన అంతమొందించేందుకు, అధికారమే లక్ష్యంగా ముఖ్య ఓటర్లు పనిచేయాలని కోరారు.

సమావేశంలో రాష్ట్ర నాయకులు సాదినేని శ్రీనివాసరావు, నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, రామకృష్ణ, బి.ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు కంకణాలు శ్రీధర్రెడ్డి, మిర్యాలగూడ నియోజకవర్గ ప్రభారి జి.లచ్చిరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ బి.రతన్ సింగ్, జిల్లా ఉపాధ్యక్షులు రేపాల పురుషోత్తంరెడ్డి, బంటు సైదులు, కర్నాటి ప్రభాకర్, దొండపాటి వెంకట్రెడ్డి, కె.అశోక్రెడ్డి, ‌సీతారాంరెడ్డి, ఎడ్ల రమేష్, బి.శీను, విద్యాసాగర్, రవి, రాజశేఖర్‌ లు పాల్గొన్నారు.

కేంద్రం బాయిల్డ్ బియ్యం కొనుగోలు చేయాలని మంత్రికి మిల్లర్ల వినతి

కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ బియ్యం కొనుగోలు చేయాలని మిర్యాలగూడ‌ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాధ్ పాండే ను కోరారు. మిర్యాలగూడ వచ్చిన ఆయనను అసోసియేషన్ తరపున సన్మానించి వినతి పత్రం సమర్పించారు.

దక్షిణ మధ్య రైల్వే అధికారులు సరిపోను రైల్వే ర్యాకులు కేటాయించక పోవడంతో ఎఫ్‌సీఐ గిడ్డంగులలో ధాన్యం పేరుకు పోతున్నాయని, ర్యాకులు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. బియ్యం పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం రాయితీలు ఇవ్వాలని కోరారు. కేంద్రానికి నివేదిస్తానని‌ మంత్రి పేర్కొన్నారు.

సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, మిర్యాలగూడ అధ్యక్ష, కార్యదర్శులు గౌరు శ్రీనివాస్, బి.వెంకటరమణ చౌదరి, కర్నాటి ప్రభాకర్, బి.కుశలయ్య, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు పాల్గొన్నారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular