విధాత, నల్గొండ అంధుల పాఠశాలను పఎయిడెడ్ గా మార్చి ప్రభుత్వమే నిర్వహించడం ద్వారా పాఠశాలలో చదువుతున్న తమ భవిష్యత్తును కాపాడాలని పాఠశాల అంధ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం అందించారు. నకిరేకల్ లో మన ఊరు.. మన బడి కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు నోముల గ్రామానికి వచ్చిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని వారు కలిసి సమస్యను విన్నవించారు. నల్గొండ డ్వాబ్ అంధ పాఠశాలను […]

విధాత, నల్గొండ అంధుల పాఠశాలను పఎయిడెడ్ గా మార్చి ప్రభుత్వమే నిర్వహించడం ద్వారా పాఠశాలలో చదువుతున్న తమ భవిష్యత్తును కాపాడాలని పాఠశాల అంధ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం అందించారు.

నకిరేకల్ లో మన ఊరు.. మన బడి కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు నోముల గ్రామానికి వచ్చిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని వారు కలిసి సమస్యను విన్నవించారు.

నల్గొండ డ్వాబ్ అంధ పాఠశాలను మూసివేయాలని నిర్వాహకులు ప్రయత్నిస్తున్న తమ పాఠశాలను ప్రభుత్వము ఎయిడెడ్ గా మార్చి మూత వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు.

Updated On 11 Jan 2023 4:26 PM GMT
krs

krs

Next Story