విధాత: ముంబయిలోని ధారావి మురికివాడకు చెందిన 14 ఏళ్ల మలీషా ఖర్వా (Maleesha Kharwa ) అనే అమ్మాయి జాక్‌పాట్ కొట్టింది. ప్రఖ్యాత లగ్జరీ బ్యూటీ బ్రాండ్ అయిన ఫారెస్ట్ ఎసెన్షియల్స్ ఆమెతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ మొదలు పెట్టిన ద యువతి కలెక్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.
2020లో హాలీవుడ్ నటుడు రాబర్ట్ హోఫ్‌మన్ ఈ స్లమ్ క్వీన్‌ను వెలుగులోకి తీసుకువచ్చాడు. ఆమె కోసమే గో ఫండ్ మి పేజ్‌నూ మొదలు పెట్టాడు. ఇన్‌స్టాలో 2,25,000ల ఫాలోయర్లు ఉన్న అమీషా.. కొన్ని కొన్ని పోస్టుల్లో ప్రిన్సెస్ ఫ్రం ద స్లమ్ అనే హ్యాష్‌ట్యాగ్‌నూ పెడుతుంది.
View this post on Instagram
తాజాగా ద యువతి కలెక్షన్ అనే సామాజిక కార్యక్రమాన్ని ముందుండి నడిపించనుంది. గత నెల ఫారెస్ట్ ఎసెన్షియల్స్ విడుదల చేసిన ఓ వీడియో తాజాగా వైరల్‌గా మారింది. అందులో ఆమె ఆ సంస్థ స్టోర్‌లోకి వెళ్లి అక్కడ ప్రదర్శనకు ఉంచిన తన ప్రచార చిత్రాలను చూస్తుంది. అంతలోనే అంతులేని ఆనందంతో తన మొహం వెలిగిపోతుంది. ఎందుకంటే మీ కలలే ముఖ్యం అనే హ్యాష్‌టాగ్‌తో ఉన్న ఆ వీడియో నెటిజన్ల మనసును దోచుకుంది.
ఇప్పటి వరకు 50 లక్షల పైగా వ్యూస్ రాగా, 4 లక్షలకు పైగా కామెంట్లు వచ్చాయి. ఈ క్యాంపెయిన్‌పై స్పందించిన మలీషా.. ఫారెస్ట్ ఎసెన్షియల్‌తో ఒప్పందం ఇప్పటి వరకు తాను చేసిన ప్రకటన కార్యక్రమాలు అన్నింటి కంటే పెద్దదని తెలిపింది. మోడల్ అవ్వాలనేది తన ఆశయమే అయినప్పటికీ చదువే తనకు మొదటి ప్రధాన్యమని చెప్పింది.