G20 Dinner | న్యూఢిల్లీ : జీ20 సమ్మిట్ నేపథ్యంలో ప్రపంచ దేశాల అధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం విందు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ప్రధానులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులకు విందు ఆహ్వాన లేఖలు అందాయి. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడను రాష్ట్రపతి కార్యాలయం విందుకు ఆహ్వానించింది. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు మాత్రం ఆహ్వానం అందలేదు. ఈ విషయాన్ని ఖర్గే కార్యాలయం ధృవీకరించింది. బీహార్ చీఫ్ […]

G20 Dinner |
న్యూఢిల్లీ : జీ20 సమ్మిట్ నేపథ్యంలో ప్రపంచ దేశాల అధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం విందు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ప్రధానులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులకు విందు ఆహ్వాన లేఖలు అందాయి.
మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడను రాష్ట్రపతి కార్యాలయం విందుకు ఆహ్వానించింది. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు మాత్రం ఆహ్వానం అందలేదు. ఈ విషయాన్ని ఖర్గే కార్యాలయం ధృవీకరించింది.
బీహార్ చీఫ్ మినిస్టర్ నితీశ్ కుమార్‌తో పాటు ఇండియా కూటమిలో ఉన్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ సింగ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లకు ఆహ్వానం అందించింది.
విందు కార్యక్రమాన్ని భారత్ మండపంలోని మల్టీ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేస్తున్నారు. విందు సందర్భంగా కల్చరల్ ప్రోగ్రామ్స్‌ను కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని స్పెషల్ సెక్రటరీ ముక్తేశ్ పర్దేశి పర్యవేక్షిస్తున్నారు.
