2024 Genral Elections | 2024 సాధారణ ఎన్నికలపై తృణమూల్ కాంగ్రెస్( TMC Party ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ( Mamata Banerjee ) కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో ఒంటరిగానే పోరాటం చేస్తామని, ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే అవకాశం లేదని మమత స్పష్టం చేశారు. తమ పొత్తు కేవలం ప్రజలతోనే ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఇతర పార్టీలతో జతకట్టే ప్రసక్తే లేదన్నారు. ప్రజల మద్దతుతో ఒంటరిగానే బరిలోకి దిగుతామని మమత చెప్పారు. భారతీయ జనతా పార్టీని ఓడించాలనుకునే వారు తృణమూల్ కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తారనే నమ్మకం తనకు ఉందని మమత పేర్కొన్నారు.
సాగర్‌దిగి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలువడం, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలువడంపై మమత స్పందిస్తూ పై వ్యాఖ్యల చేశారు. సీపీఐ(ఎం), కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తే, బీజేపీకి ఓటేసినట్లే అని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ అనైతిక పొత్తు కారణంగానే సాగర్‌దిగి ఉప ఎన్నికలో టీఎంసీ ఓడిపోయిందన్నారు. తమ అభ్యర్థికి ఓటమి నేపథ్యంలో తాను ఎవర్నీ నిందించను. కానీ బీజేపీ, కాంగ్రెస్ అనైతిక పొత్తును తీవ్రంగా ఖండిస్తున్నానని మమత పేర్కొన్నారు.
BS Yediyurappa। యడ్యూరప్పకు కీలక పదవి? ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ ఎత్తు!