Maharashtra | ఓ జంట ప‌ట్ట‌ప‌గ‌లే న‌డిరోడ్డుపై జ‌ల‌కాలాట‌లో మునిగి తేలింది. యాక్టివాపై వెళ్తున్న ఈ జంట అంద‌రూ చూస్తుండ‌గానే ఈ చ‌ర్య‌కు పాల్ప‌డింది. వీరు చేసిన ప‌నికి జ‌నాలు మండిప‌డుతున్నారు. న‌డిరోడ్డుపై ఇత‌రుల‌కు ఇబ్బంది క‌లిగించ‌డం స‌రికాద‌ని నెటిజ‌న్లు ధ్వ‌జ‌మెత్తుతున్నారు. మ‌హారాష్ట్ర థానే జిల్లాలోని ఉల్హాస్‌న‌గ‌ర్ ప్ర‌ధాన సిగ్న‌ల్ వ‌ద్ద యాక్టివాపై వ‌చ్చిన ఓ జంట ఆగింది. ఇక అక్క‌డ త‌మ వెంట తెచ్చుకున్న నీళ్ల‌ను మీద పోసుకున్నారు. యాక్టివాపై వెనుకాల కూర్చున్న యువ‌తి త‌న‌తో […]

Maharashtra | ఓ జంట ప‌ట్ట‌ప‌గ‌లే న‌డిరోడ్డుపై జ‌ల‌కాలాట‌లో మునిగి తేలింది. యాక్టివాపై వెళ్తున్న ఈ జంట అంద‌రూ చూస్తుండ‌గానే ఈ చ‌ర్య‌కు పాల్ప‌డింది. వీరు చేసిన ప‌నికి జ‌నాలు మండిప‌డుతున్నారు. న‌డిరోడ్డుపై ఇత‌రుల‌కు ఇబ్బంది క‌లిగించ‌డం స‌రికాద‌ని నెటిజ‌న్లు ధ్వ‌జ‌మెత్తుతున్నారు.

మ‌హారాష్ట్ర థానే జిల్లాలోని ఉల్హాస్‌న‌గ‌ర్ ప్ర‌ధాన సిగ్న‌ల్ వ‌ద్ద యాక్టివాపై వ‌చ్చిన ఓ జంట ఆగింది. ఇక అక్క‌డ త‌మ వెంట తెచ్చుకున్న నీళ్ల‌ను మీద పోసుకున్నారు. యాక్టివాపై వెనుకాల కూర్చున్న యువ‌తి త‌న‌తో పాటు త‌న బాయ్ ఫ్రెండ్‌పై నీళ్లు గుమ్మ‌రించింది. ఈ త‌తంగాన్ని అక్క‌డున్న కొంద‌రు త‌మ మొబైల్ ఫోన్ల‌లో చిత్రీక‌రించి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ చేశారు.

ఓ నెటిజ‌న్ ఈ వీడియోను మ‌హారాష్ట్ర డీజీపీ, థానే పోలీసుల‌కు ట్విట్ట‌ర్‌లో ట్యాగ్ చేశారు. ఉల్హాస్‌న‌గ‌ర్ సెక్టార్ 17 మెయిన్ సిగ్న‌ల్ వ‌ద్ద ఈ జంట జ‌ల‌కాలాట ఆడి, ఇతరుల‌కు ఇబ్బంది క‌లిగించింద‌ని పేర్కొన్నారు. వీరిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆ నెటిజ‌న్ కోరాడు. ఆ నెటిజ‌న్ ట్వీట్‌పై థానే పోలీసులు స్పందించారు. ట్రాఫిక్ పోలీసులు ఆ జంట‌పై చ‌ర్య‌లు తీసుకుంటార‌ని స్ప‌ష్టం చేశారు.

Updated On 19 May 2023 5:40 AM GMT
subbareddy

subbareddy

Next Story