Saturday, January 28, 2023
More
  Homelatestమెద‌క్‌లో దారుణం: కారులోనే వ్యక్తి సజీవదహనం..

  మెద‌క్‌లో దారుణం: కారులోనే వ్యక్తి సజీవదహనం..

  • టేక్మాల్ మండలం వెoకటాపూర్ గ్రామ శివారులో ఘటన
  • సంఘటన స్థలంలో పెట్రోల్ డబ్బా, పొదల్లో బ్యాగును గుర్తించిన పోలీసులు
  • హత్య చేసి శవాన్ని కారులో తెచ్చి తగులబెట్టినట్లు అనుమానిస్తున్న పోలీసులు
  • మృతుడు సెక్రటేరియట్ ఉద్యోగి ధ‌ర్మానాయక్‌గా గుర్తింపు

  విధాత, మెదక్ బ్యూరో: గుర్తు తెలియని వ్యక్తిని హత్యచేసి కారులో తీసుకు వచ్చి మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెoకటాపూరం గ్రామ శివారులో కారుతో సహా గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేశారు. దీంతో కారు పూర్తిగా కాలి పోయింది. కారులో ఉన్న వ్యక్తి పూర్తిగా కాలి ముద్దగా మారిపోయాడు.

  సంఘటన స్థలంలో పెట్రోల్ డబ్బాతో పాటు ముళ్ళ పొదలో బ్యాగు లభ్యమైనట్లు తెలుస్తుంది. మృతుడి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. కారు నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం పోలీసులు, ఇంటెలిజన్స్ పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. సంఘటన స్థలానికి క్లూస్ టీం బృందం చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.

  మృతుడు సెక్రటేరియట్ ఉద్యోగి

  కారులో సజీవదహనం ఐన వ్యక్తి బీమ్లా తండాకు చెందిన ధ‌ర్మానాయక్ గా గుర్తించారు. ధ‌ర్మానాయక్ (45) టేక్మాల్ మండలం భీమ్లా తండాకు చెందిన వ్యక్తిగా పోలీస్ లు గుర్తించారు. డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలం నుండి మృతిని ఇంటికే వెళ్ళడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధ‌ర్మానాయక్ ను హత్య చేసిన వారు మృతునితో కలిసే ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.. ఘటనా స్థలాన్ని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సందర్శించారు. టేక్మాల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు..

  సంగారెడ్డి జిల్లాలో భారీ భూ కుంభకోణం.. 

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular