Family Court | ఇద్దరు భార్యల (Wifes) ముద్దుల మొగుడు (Husband) అతను. మొదటి భార్యకు దూరంగా ఉండటంతో ఆమె కోర్టు (Court)ను ఆశ్రయించింది. కోర్టు కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగించ కుండా తీర్పు ఇచ్చింది. ఒక భార్యతో మూడు రోజులు, మరో భార్యతో మూడు రోజులు ఉండాలని, ఆదివారం (Sunday) మీ ఇష్టం అని భర్తకు కోర్టు సూచించింది.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) గ్వాలియర్‌కు చెందిన ఓ వ్యక్తి.. హర్యానా (Haryana) లోని ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఇంజినీర్ (Engineer)గా ఉద్యోగం చేస్తున్నాడు. 2018లో ఆ ఇంజినీర్‌కు గ్వాలియర్ (Gwalior)కు చెందిన యువతితో పెళ్లైంది. 2020లో కరోనా (Corona) కారణంగా భార్యను ఆమె పుట్టింటికి పంపించాడు. అతనేమో హర్యానాకే పరిమితమయ్యాడు. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా భార్యను హర్యానాకు తీసుకెళ్లలేదు.
సహోద్యోగితో రెండో వివాహం..
ఇక మొదటి భార్యను దూరం పెట్టిన ఇంజినీర్.. తనతో పాటు పని చేస్తున్న సహోద్యోగిపై మనసు పారేసుకున్నాడు. ఆమెతో రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇంజినీర్ మొదటి భార్యను పట్టించుకోక పోవడంతో ఆమెకు ఓపిక నశించింది. దీంతో నేరుగా హర్యానాకు వెళ్లిపోయింది. అతను మరో యువతిని పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది.
దీంతో తనకు న్యాయం చేయాలంటూ గ్వాలియర్‌లోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 6 నెలల పాటు ఆ ముగ్గురికి కోర్టు కౌన్సెలింగ్ ఇచ్చి, సయోధ్య కుదిర్చారు. ఇద్దరు భార్యలకు మూడు రోజుల చొప్పున సమయం కేటాయించాలని, ఆదివారం మీ ఇష్టం అని ఇంజినీర్‌కు కోర్టు సూచించింది. ఈ తీర్పు అనంతరం భార్యలిద్దరికీ చెరో ఫ్లాట్ కొనిచ్చి.. గొప్ప మనసు చాటుకున్నాడు ఇంజినీర్.