Viral Pic | ఎండ‌కు ఎండుతూ.. వాన‌కు త‌డుస్తూ.. చ‌లికి వ‌ణుకుతూ త‌మ జీవితాన్ని వెల్ల‌దీస్తున్న అభాగ్యులు ఎంద‌రో ఉన్నారు.. బుక్కెడు బువ్వ లేక‌.. గుక్కెడు నీళ్లు లేక ఆక‌లితో అల‌మ‌టిస్తున్న మ‌న‌షులు ఎంద‌రో ఉన్నారు. ఫుట్‌పాత్‌లే త‌మ ఆశ్రయాలుగా అనుకొని జీవిస్తున్న నిరాశ్ర‌యులు ఎంద‌రో ఉన్నారు. ఇలాంటి క‌థనాలు రోజుకు ఎన్నెన్నో చ‌దువుతుంటాం.. ఎన్నెన్నో వింటుంటాం. కానీ త‌న‌కు గూడు లేన‌ప్ప‌టికీ, విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన శున‌కాల‌ను మాత్రం త‌న గుండెల్లో దాచుకున్నాడు ఓ వ్య‌క్తి. […]

Viral Pic | ఎండ‌కు ఎండుతూ.. వాన‌కు త‌డుస్తూ.. చ‌లికి వ‌ణుకుతూ త‌మ జీవితాన్ని వెల్ల‌దీస్తున్న అభాగ్యులు ఎంద‌రో ఉన్నారు.. బుక్కెడు బువ్వ లేక‌.. గుక్కెడు నీళ్లు లేక ఆక‌లితో అల‌మ‌టిస్తున్న మ‌న‌షులు ఎంద‌రో ఉన్నారు. ఫుట్‌పాత్‌లే త‌మ ఆశ్రయాలుగా అనుకొని జీవిస్తున్న నిరాశ్ర‌యులు ఎంద‌రో ఉన్నారు. ఇలాంటి క‌థనాలు రోజుకు ఎన్నెన్నో చ‌దువుతుంటాం.. ఎన్నెన్నో వింటుంటాం. కానీ త‌న‌కు గూడు లేన‌ప్ప‌టికీ, విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన శున‌కాల‌ను మాత్రం త‌న గుండెల్లో దాచుకున్నాడు ఓ వ్య‌క్తి. విశ్వాసం లేని మ‌న‌షుల కంటే నోరు లేని ఈ జీవాల విశ్వాస‌మే అత‌నికి గొప్ప అనిపించింది. అందుకేనేమో ఆ శున‌కాల‌ను అంత‌గా ప్రేమిస్తున్నాడు ఆ నిరాశ్ర‌యుడు.

అయితే ఆ నిరాశ్ర‌యుడు ఫుట్‌పాతే త‌న ఆశ్ర‌యంగా ఏర్పాటు చేసుకుని జీవితాన్ని గ‌డిపేస్తున్నాడు. ఇక ఆ వృద్ధుడి వ‌ద్ద‌కు శున‌కాలు వ‌స్తుంటాయి. వాటితో అత‌ను కూడా స్నేహంగా ఉంటున్నాడు. అలా ఆ వ్య‌క్తికి, శున‌కాల మ‌ధ్య స్నేహం కుదిరింది. ఇక తన‌కు గూడు లేన‌ప్ప‌టికీ.. ఆ శున‌కాల‌ను మాత్రం గుండెల్లో దాచుకున్నాడు. ఫుట్‌పాత్‌పై తాను ప‌డుకున్న స్థలంలోనే ఓ ఏడు కుక్క‌ల‌కు కూడా ఆశ్ర‌య‌మిచ్చాడు. కింద ఓ ప‌లుచ‌ని ప‌రుపు వేసుకుని నిద్రిస్తున్న ఆ వ్య‌క్తి ప‌క్క‌నే ఏడు శున‌కాలు కూడా హాయిగా నిద్ర పోతున్నాయి. అత‌ని త‌ల వ‌ద్ద ఓ గొడుగు, ఇత‌ర వ‌స్తువులు ఉన్నాయి.

ఈ ఫోటోను ఇండియ‌న్ ఫారెస్ట్ ఆఫీస‌ర్ సుశాంత నంద త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ప్ర‌పంచానికి అనుగుణంగా మ‌న హృద‌యం త‌గినంత పెద్ద‌దిగా ఉండాల‌ని ఐఎఫ్ఎస్ ఆఫీస‌ర్ క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈ ఫోటోపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇది హృద‌యాన్ని హ‌త్తుకునేలా ఉంద‌ని ఒక‌రు కామెంట్ చేశారు. 24 క్యారెట్ గోల్డ్ హార్ట్ అని మ‌రో యూజ‌ర్ రాసుకొచ్చారు. ఈ భూమ్మీద దేవుడు ఉన్నాడని మ‌రొక‌రు స్పందించారు. ఆ మ‌నిషిది గొప్ప మ‌న‌సు అని మ‌రొక‌రు కొనియాడారు.

Updated On 23 Nov 2022 1:18 PM GMT
subbareddy

subbareddy

Next Story