Manchiryala
- తరలి వచ్చిన అభిమానులు..
విధాత, ప్రతినిధి ఆదిలాబాద్: మంచిర్యాల పట్టణంలో మార్కెట్ రోడ్‌లో కొత్తగా నిర్మితమైన చెన్నై షాపింగ్ మాల్‌ను సినీ నటి కృతి శెట్టి, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రారంభించారు.
వర్ధమాన సినీనటి కృతి శెట్టి జిల్లా కేంద్రంలో చెన్నై షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో సందడి చేశారు. సినీ నటిని చూడడానికి అభిమానులు తరలివచ్చారు. ఈ మధ్యకాలంలో ఉప్పెన, బంగార్రాజు లాంటి వరుస హిట్ సినిమాలలో నటించిన కృతి శెట్టిని చూడడానికి అభిమానులు తరలి రావడంతో షాపింగ్ మాల్ రోడ్డు సందడిగా మారింది.
ఈ సందర్భంగా కృతి శెట్టి మాట్లాడుతూ.. నాణ్యమైన మన్నికైన దుస్తులకు మారుపేరుగా ఈ షాపింగ్ మాల్ నిలుస్తుందని తెలిపారు. చెన్నై షాపింగ్ మాల్‌లో మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే ధరలకే బట్టలు లభిస్తాయని పేర్కొంది.
ఇతర షాపులతో పోల్చుకుంటే చెన్నై షాపింగ్ మాల్‌లో దుస్తుల రేటు తక్కువ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, చెన్నై షాపింగ్ మాల్ యజమాని, సిబ్బంది మంచిర్యాల పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.