విధాత: మంచు మోహన్ బాబు చిన్న చిన్న పాత్రలలో చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి ఏకంగా హీరోగా అవతారం ఎత్తాడు. అంతేకాకుండా తానే నిర్మాతగా శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించాడు. ఆనాడు ఎన్టీఆర్ నిన్న మొన్నటి వరకు దాసరి నారాయణరావు మధ్యలో పరిటాల రవి వంటి వారి మద్దతు లభించింది.
వారి మద్దతుతోనే ఆయన బాగా పుంజుకున్నాడు. ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్ అవసరమైనప్పుడల్లా మోహన్ బాబుకు సాయం చేస్తూ ఉంటాడు. ఇలా మంచు సామ్రాజ్యాన్ని మోహన్ బాబు స్థాపించినా.. ఆయన సంతానం మాత్రం ఆయన లెగసీని ముందుకు తీసుకుపోలేకపోతున్నారు.
మంచు మనోజ్ వెండితెరపై కనిపించి ఎంతో కాలమైంది. ఇక మోహన్ బాబు ఇటీవల ‘సన్నాఫ్ ఇండియా’ అనే చిత్రం చేశాడు. మంచు విష్ణు ‘జిన్నా’ అనే చిత్రంలో నటించాడు. ఈ రెండు చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. దానికి తోడు వీరి ఫ్యామిలీ పై, వారు చేసే వ్యాఖ్యలపై, వారి నడవడికపై సోషల్ మీడియాలో ట్రోల్స్ విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి.
అవి కూడా ఆయా చిత్రాల ఫలితాలపై ప్రభావం చూపుతూ వస్తున్నాయి. ఇటీవల మంచు విష్ణు మాట్లాడుతూ ఓ పెద్ద స్టార్.. డబ్బులు ఇచ్చి మరీ మా ఫ్యామిలీని ట్రోల్ చేయిస్తున్నాడు. అతని ఆఫీస్ అడ్రస్ కూడా నాకు తెలుసు. పోలీసులకు కంప్లైంట్ చేస్తాను అంటూ ఏదేదో మాట్లాడాడు. ఇన్ని జరుగుతున్న మంచు లక్ష్మీ మాత్రం ఇలాంటి వాటిని పట్టించుకోను అంటుంది.
కొన్ని ఇంగ్లీష్ టాక్ షోలలో పనిచేసిన ఆమె.. అదే అనుభవంతో తెలుగులో పలు టాక్ షోలు నిర్వహించింది. కానీ ఇందులో ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. ఇక హీరోయిన్ కావాలనుకుంది. అది నెరవేరలేదు. నిర్మాతగా అయినా సక్సెస్ సాధించాలని భావించింది. అది కూడా సాధ్యపడలేదు. ఇక వయసుతో సంబంధం లేకుండా హాట్ అండ్ గ్లామరస్ ఫోటోషూట్ చేస్తుంది.
తాజాగా డిజైనర్ శారీ ధరించి కిర్రాక్ ఫోజులు ఇచ్చింది. ఫోటోలు సంగతి అటు ఉంచితే.. ఆమె ఓ వింత కామెంట్ చేసింది. ఇన్స్టాగ్రామ్ లో తన లేటెస్ట్ ఫోటోషూట్‌కి ‘బీట్‌రూటా లేక వైనా.. ఏది కావాలో కింద కామెంట్ చేయండి’ అని మంచు లక్ష్మీ కామెంట్ పెట్టింది. మీకు ఏది కావాలని ఆమె అడిగినట్టుగా పోస్ట్ ఉంది. మంచు లక్ష్మీ కామెంట్ చూసి జనాలు రచ్చ చేస్తున్నారు. తమ ఫీలింగ్స్ ను కామెంట్ల రూపంలో పోస్ట్ చేస్తున్నారు.