విధాత‌, సినిమా: సోషల్ మీడియా వినియోగం పెరిగాక సెలబ్రిటీలను ట్రోల్ చేయడం సర్వసాధారణ మైంది. ట్రోలింగ్ బారిన పడ‌ని సెలబ్రిటీలు లేరు. జూనియర్ ఎన్టీఆర్‌ను సైతం ట్రోల్ చేశారు. ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్ వచ్చిన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అక్కడి యాస‌లో ఇంగ్లీషు మాట్లాడారు. ఆయ‌న అమెరిక‌న్ యాస చూసి పలువురు ప్రశంసించారు. ఇక అమెరికన్ యాస‌ను చూసి అక్కడ మీడియా ప్ర‌తినిధులు సైతం ఆశ్చ‌ర్యపోయారు. జూనియర్ యాస‌పై విదేశీయులు ప్రశంసలు కురిపిస్తుంటే.. మన దగ్గర మరి […]

విధాత‌, సినిమా: సోషల్ మీడియా వినియోగం పెరిగాక సెలబ్రిటీలను ట్రోల్ చేయడం సర్వసాధారణ మైంది. ట్రోలింగ్ బారిన పడ‌ని సెలబ్రిటీలు లేరు. జూనియర్ ఎన్టీఆర్‌ను సైతం ట్రోల్ చేశారు. ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్ వచ్చిన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అక్కడి యాస‌లో ఇంగ్లీషు మాట్లాడారు. ఆయ‌న అమెరిక‌న్ యాస చూసి పలువురు ప్రశంసించారు.

ఇక అమెరికన్ యాస‌ను చూసి అక్కడ మీడియా ప్ర‌తినిధులు సైతం ఆశ్చ‌ర్యపోయారు. జూనియర్ యాస‌పై విదేశీయులు ప్రశంసలు కురిపిస్తుంటే.. మన దగ్గర మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ యాసపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. రెండు మూడు రోజులు దీనిపై భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది. తాజాగా ఈ వివాదంపై నటి కస్తూరి స్పందించింది.

ఓ యూట్యూబ్‌ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కస్తూరి మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ని ట్రోల్ చేయడంపై ఘాటుగా స్పందించింది. అమెరికా వాళ్ళకి వాళ్ళ యాస‌లో మాట్లాడితేనే అర్థమవుతుంది. మన ఇంగ్లీష్‌లో మాట్లాడితే వారికి అర్థం కాదు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ అమెరికన్ యాస‌లో మాట్లాడారు. ఆ విషయంలో ఎన్టీఆర్ చేసింది కరెక్ట్.

కానీ మన దగ్గర మాత్రం చాలా మంది జూనియర్ ఎన్టీఆర్‌ది ఫేక్ యాస అని ట్రోల్ చేస్తున్నారు. అది చాలా తప్పు. నేను కూడా అమెరికాలో ఉన్నాను. అక్కడ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అమెరికా వాళ్లకి వాళ్ల లాగా మాట్లాడితే అర్థమవుతుంది. నేను ఇక్కడ తెలుగులో నా తమిళ యాస‌‌లో మాట్లాడితే అర్థం అవుతుందా? అర్థం కాదు కదా! అని చెప్పుకొచ్చింది కస్తూరి.

ఈ సందర్భంగా మంచు లక్ష్మీ ప్రస్తావనని యాంకర్ తెచ్చారు. మంచు లక్ష్మీ కూడా అలాంటి యాస‌లో మాట్లాడుతుంది ఆమెని ట్రోల్ చేస్తారని అంటే.. దీనికి నటి కస్తూరి షాకింగ్ సమాధానం ఇచ్చింది. మంచు లక్ష్మి యాస‌కి స్పందిస్తూ.. నిజమైన ప్రయత్నానికి, కావాలని చేసే ఫేక్ ప్రయత్నానికి ఈ తేడా ఉంది కదా! హైదరాబాదుకు వచ్చి అలాంటి యాస‌లో మాట్లాడితే కచ్చితంగా ట్రోల్ చేస్తారు.

ఇక్కడ తెలుగే మాట్లాడొచ్చు కదా! తెలుగు కూడా అమెరికన్ యాస‌లా మాట్లాడడం ఎందుకు? అంటూ మంచు లక్ష్మీకి పరోక్షంగా చుర‌కలంటించింది. ఈ విషయంలో ఎన్టీఆర్‌ను మంచు లక్ష్మీతో పోల్చవద్దని సూచించింది.

కస్తూరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంచు లక్ష్మీని టార్గెట్ చేసుకుని కామెంట్ చేయడంతో ట్రోలర్స్ మరింత రెచ్చిపోతున్నారు. కస్తూరి విషయానికి వస్తే తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో మెప్పించింది. ఇటీవల గాడ్‌ఫాదర్ చిత్రంలో కనిపించింది. ఇక తెలుగు సీరియల్స్‌లో నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని ఆమె సొంతం చేసుకుంది.

Updated On 1 March 2023 1:31 PM GMT
Somu

Somu

Next Story