Manchu Lakshmi | సెలబ్రిటీలు లాంగ్ రన్‌లో ముందుకు సాగాలంటే ఫిట్‌నెస్ చాలా అవ‌స‌రం. వారు త‌మ సౌంద‌ర్యాన్ని కాపాడుకోవ‌డానికి యోగ సాధ‌న‌తో పాటు వ‌ర్క‌వుట్స్ కూడా చేస్తుంటారు. క్రమం తప్పకుండా వ‌ర్క‌వుట్స్ చేయ‌డం వ‌ల‌న చాలా ఉప‌యొగాలు ఉన్నాయి. మంచు వార‌మ్మాయి మంచు ల‌క్ష్మీ నిత్యం తన వ‌ర్క‌వుట్స్‌తో బిజీగా ఉంటూ అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా వ‌ర్క‌వుట్ షూట్ కోసం మంచు ల‌క్ష్మీ చేసిన విన్యాసాలు […]

Manchu Lakshmi |

సెలబ్రిటీలు లాంగ్ రన్‌లో ముందుకు సాగాలంటే ఫిట్‌నెస్ చాలా అవ‌స‌రం. వారు త‌మ సౌంద‌ర్యాన్ని కాపాడుకోవ‌డానికి యోగ సాధ‌న‌తో పాటు వ‌ర్క‌వుట్స్ కూడా చేస్తుంటారు. క్రమం తప్పకుండా వ‌ర్క‌వుట్స్ చేయ‌డం వ‌ల‌న చాలా ఉప‌యొగాలు ఉన్నాయి. మంచు వార‌మ్మాయి మంచు ల‌క్ష్మీ నిత్యం తన వ‌ర్క‌వుట్స్‌తో బిజీగా ఉంటూ అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా వ‌ర్క‌వుట్ షూట్ కోసం మంచు ల‌క్ష్మీ చేసిన విన్యాసాలు ప్ర‌తి ఒక్క‌రిని అబ్బుర‌ప‌రుస్తున్నాయి. మంచు ల‌క్ష్మీనా, మ‌జాకానా అని ఆమె వీడియోని చూసిన ప్ర‌తి ఒక్కరు ప్ర‌శంసిస్తున్నారు. ఐదు ప‌దుల వ‌య‌స్సులోను మంచు ల‌క్ష్మీ ఇంత యాక్టివ్‌గా, అందంగా, ఎన‌ర్జిటిక్‌గా ఉండ‌డానికి కార‌ణం వ‌ర్క‌వుట్స్ అని అంటున్నారు.

మోహన్ బాబు వారసురాలైన మంచు లక్ష్మి విదేశాల్లో చదువుకోగా, అక్క‌డే ఆమె కెరీర్ కొన‌సాగించింది. కొన్ని అమెరికన్ షోలకు హోస్ట్ గా వ్యవహరించిన మంచు లక్ష్మి ఆ త‌ర్వాత ప‌లు చిత్రాల‌లో కూడా న‌టించింది. అక్క‌డ అమ్మ‌డి కెరీర్ మంచిగానే సాగుతున్న‌ప్ప‌టికీ హాలీవుడ్ వదిలి టాలీవుడ్ లో అడుగు పెట్టింది.

తెలుగులో ఆమె మొదటి చిత్రం అనగనగా ఓ ధీరుడు కాగా ఈ చిత్రంలో సిద్ధార్థ్-శృతి హాసన్ జంటగా నటించారు. మంచు ల‌క్ష్మీ విల‌న్ రోల్ చేసి ప్ర‌తి ఒక్క‌రిని మెప్పించింది. ఈ సినిమా త‌ర్వాత మంచు ల‌క్ష్మీకి చాలానే ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. కాని ఆమెకు బ్రేక్ రాలేదు. హీరోయిన్ గా, నటిగా అనేక ప్రయత్నాలు చేసినా స్టార్ స్టేస్ పెద్ద‌గా అందుకోలేక‌పోయింది.

మంచు లక్ష్మీ జ‌యాప‌జాయాల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటుంది. గుండెల్లో గోదావరి, లక్ష్మీ బాంబ్, వైఫ్ ఆఫ్ రామ్ చిత్రాల్లో మంచు లక్ష్మి హీరోయిన్ గా నటించ‌గా, మ‌రి కొన్ని చిత్రాల్లో విలన్, క్యారెక్టర్ రోల్స్ పోషించింది.

ఇక సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు త‌న అంద‌చందాల‌తో కూడా ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఇక‌ ఇటీవల మంచు లక్ష్మి తన తమ్ముడు మనోజ్ వివాహం దగ్గరుండి ఘ‌నంగా జ‌రిపించింది. మోహన్ బాబు, మంచు విష్ణుకు ఇష్టం లేకపోయినా మనోజ్-మౌనికల వివాహం చేసింద‌ని ఫిలిం న‌గ‌ర్‌లో ప్ర‌చారం జ‌రిగింది.

లిప్‌లాక్‌లతో ‘మాన్‌స్టర్‌’లో లెస్బియన్‌గా కేక పెట్టించిన మంచులక్ష్మి..!

Updated On 14 Sep 2023 11:31 PM GMT
sn

sn

Next Story