Manchu | విధాత: టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ నెంబర్ వన్‌గా ఉండాలని ఆ ఫ్యామిలీ పెద్ద మంచు మోహన్ బాబు తెగ తాపత్రయ పడిపోతుంటారు. కానీ వాళ్ల సినిమాలేవీ ఆ ఫ్యామిలీని నెంబర్ వన్ చేయలేకపోయాయి. ఇండస్ట్రీలో ఓ నాలుగైదు ఫ్యామిలీ పేర్ల తర్వాతే మంచు ఫ్యామిలీ పేరు వినిపిస్తుంది. దీనికి వారి స్వయంకృతాపరాధం కూడా ఉంది. మోహన్ బాబు అనగానే క్రమశిక్షణకు మారుపేరని ఇండస్ట్రీలో అంతా అంటుంటారు. అది ఎంత వరకు అనేదే ప్రస్తుతం […]

Manchu |

విధాత: టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ నెంబర్ వన్‌గా ఉండాలని ఆ ఫ్యామిలీ పెద్ద మంచు మోహన్ బాబు తెగ తాపత్రయ పడిపోతుంటారు. కానీ వాళ్ల సినిమాలేవీ ఆ ఫ్యామిలీని నెంబర్ వన్ చేయలేకపోయాయి. ఇండస్ట్రీలో ఓ నాలుగైదు ఫ్యామిలీ పేర్ల తర్వాతే మంచు ఫ్యామిలీ పేరు వినిపిస్తుంది. దీనికి వారి స్వయంకృతాపరాధం కూడా ఉంది.

మోహన్ బాబు అనగానే క్రమశిక్షణకు మారుపేరని ఇండస్ట్రీలో అంతా అంటుంటారు. అది ఎంత వరకు అనేదే ప్రస్తుతం మ్యాటర్ కాదు కానీ.. మంచు ఫ్యామిలీ ఇమేజ్ డ్యామేజ్ కావడానికి మాత్రం.. వారు ఏదైతే తమకు బలమని అనుకుంటున్నారో.. అదే బలహీనతగా మారుతుందనేది కాదనలేని వాస్తవం.

అదేంటి అనేది ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరమే లేదు.. ఇండస్ట్రీలోని వ్యక్తులనే కాకుండా.. ఇండస్ట్రీ గురించి తెలిసిన ప్రేక్షకులెవరిని అడిగినా ఆ విషయం చెప్పేస్తారు. సరే.. ఇక విషయంలోకి వస్తే.. మంచు ఫ్యామిలీ మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈసారి అలాంటి ఇలాంటి నిర్ణయం కాదు. ఇది రూ. 100 కోట్ల మ్యాటర్.

ఈ మధ్య చిన్న, పెద్ద అనే తేడా లేకుండా రూ. 100 కోట్ల బడ్జెట్‌తో సినిమా చేస్తున్నామని నిర్మాతలు ప్రకటిస్తున్నారు. ఆ లిస్ట్‌లో మేమూ ఉండాలని మంచు ఫ్యామిలీ తహతహలాడుతోంది. మంచు ఫ్యామిలీకి సంబంధించిన ఈ రూ. 100కోట్ల సమాచారాన్ని స్వయంగా మంచు మోహన్‌ బాబే రివీల్ చేశారు.

త్వరలో మోహన్ బాబు ప్రధాన పాత్రలో రూ. 100 కోట్లతో మంచు విష్ణు ఓ సినిమా చేయబోతున్నారట. అదీ కూడా తను నిర్మించిన కాలేజీ నేపథ్యంలో.. అక్కడి విద్యార్థులపై ప్రభావం చూపించేలా ఈ సినిమా ఉంటుందని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని మంచు విష్ణు వెల్లడించనున్నారని మంచు మోహన్ బాబు తెలియజేశారు.

మంచు మోహన్ బాబు గురువారం తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని దర్శించుకున్నారు. ఆ దర్శనం అనంతరం కాసేపు మీడియాతో ముచ్చటించారు. అప్పుడే ఈ విషయాన్ని తెలియజేశారు. మోహన్ బాబు నుంచి ఎప్పుడైతే ఈ రూ.100 కోట్ల మాట బయటికి వచ్చిందో.. ప్రేక్షకులందరూ షాకయ్యారు.

ఇక మంచు ఫ్యామిలీ మెంబర్స్ మారరా? రీసెంట్‌గా మోహన్ బాబు హీరోగా నటించిన ‘సన్నాఫ్ ఇండియా’ సోదిలో లేకుండా పోయింది. ఆ సినిమాకు ఎదురు డబ్బులిచ్చి మరీ.. థియేటర్లకి ప్రేక్షకులని రప్పించినట్లుగా వార్తలు వచ్చాయి. అలాగే ఓటీటీలో కూడా ఎదురు డబ్బులిచ్చి మరీ విడుదల చేశారనే టాక్ నడిచింది.

మోహన్ బాబు పరిస్థితి ఇలా ఉంటే.. సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్‌‌తో మంచు విష్ణు చేసిన ‘జిన్నా’ ప్రయోగం కూడా అంత గొప్పగా సక్సెస్ కాలేదు. ఇలాంటి ఉదాహరణలను చూసైనా.. భారీ బడ్జెట్ జోలికి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటారని అనుకుంటే.. అదేం లేదు అన్నట్లుగా మంచు ఫ్యామిలీ తీరు ఉంది.

అసలింత డబ్బు వీరికి ఎక్కడి నుంచి వస్తుంది? సినిమాలకు బదులు ఏదైనా సేవా కార్యక్రమాలు చేసుకున్నా.. కాసింత పుణ్యం వస్తుంది కదా.. అనేలా కొందరు నెటిజన్లు మంచు ఫ్యామిలీపై సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతానికైతే మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ రూ. 100 కోట్ల వార్త.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిందనేది టాలీవుడ్ లేటేస్ట్ న్యూస్. అది విషయం.

Updated On 2 Jun 2023 4:48 AM GMT
krs

krs

Next Story