ఇన్నాళ్లకు వెలుగు చూసిన జీవో విధాత: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఎంతమంది సలహాదారులు ఉన్నారో లెక్కా పత్రం లేదు.. ప్రతినెలా ఒకరిద్దరు అపాయింట్ అవుతూనే ఉన్నారు. ఎవరు ఏ శాఖకు, ఏ విభాగానికి సలహాదారుగా ఉన్నారో కూడా తెలీదు… ఇదిలా ఉండగానే శ్రీవెంకటేశ్వర భక్తి ఛానెల్ సలహాదారుగా జానపద , సినీ గాయని సత్యవతి (మంగ్లీ)ని నియమించినట్లు ఓ జీవో వెలుగు చూసింది. గత మార్చి 29న ఆమెను లక్ష జీతంతో నియామకం చేస్తున్నట్లు జీవో అయితే […]

- ఇన్నాళ్లకు వెలుగు చూసిన జీవో
విధాత: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఎంతమంది సలహాదారులు ఉన్నారో లెక్కా పత్రం లేదు.. ప్రతినెలా ఒకరిద్దరు అపాయింట్ అవుతూనే ఉన్నారు. ఎవరు ఏ శాఖకు, ఏ విభాగానికి సలహాదారుగా ఉన్నారో కూడా తెలీదు… ఇదిలా ఉండగానే శ్రీవెంకటేశ్వర భక్తి ఛానెల్ సలహాదారుగా జానపద , సినీ గాయని సత్యవతి (మంగ్లీ)ని నియమించినట్లు ఓ జీవో వెలుగు చూసింది.
గత మార్చి 29న ఆమెను లక్ష జీతంతో నియామకం చేస్తున్నట్లు జీవో అయితే వచ్చింది. కానీ అది నిన్నా మొన్న వెలుగు చూడడమే విచిత్రం. ఎంతోమందిని సలహాదారులుగా నియమించిన ప్రభుత్వం వాటికి సంబంధించిన జీవోలు బయటకు విడుదల చేస్తూనే వస్తోంది. కానీ ఈ మంగ్లీ నియామకం ఉత్తర్వు మాత్రం ఇన్నాళ్లకు వెలుగు చూసింది.
ఇంతా చేస్తే మంగ్లీ ఆ పోస్టులో చేరనే లేదు. వాస్తవానికి సదరు వ్యక్తి ఆయా పోస్టులో చేరతాను అన్నాకనే, వారి సమ్మతితోనే నియామకం ఉత్తర్వులు వస్తాయి. శ్రీరామచంద్ర మూర్తి వంటి సలహాదారులు ఆయా పదవుల్లో చేరిన తరువాత అందులో కుదురుకోలేక రాజీనామా చేశారు అది వేరే సంగతి .
కానీ ఈమె విషయంలో మాత్రమే జీవో వచ్చినా ఆమె ఆ పోస్టులో చేరకుండా ఉండిపోవడం జరిగింది. ఆ మధ్య కూడా జగన్ ను మంగ్లీ కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వచ్చాయ. కానీ తరువాత మరి ఏమైందో.. ఆమె అసలు భక్తి ఛానెల్లో చేరినట్టా లేదా అన్నది క్లారిటీ లేకుండా ఉండిపోయింది. ఇప్పటికైతే ఆమె చేరలేదనే అంటున్నారు.
