విధాత: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా మాణిక్‌రావు థాక్రేను ఏఐసీసీ నియమించింది. ప్రస్తుత ఇంచార్జి మాణిక్యం ఠాగూర్‌ను ఏఐసీసీ రిలీవ్ చేసింది. గోవా కాంగ్రెస్ ఇన్చార్జిగా ఉన్న మాణిక్‌రావు థాక్రేకు తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలను అప్పజెప్పింది. గోవా ఇంచార్జిగా మాణిక్యం ఠాగూర్‌కు బాధ్యతలు అప్పగించింది ఏఐసీసీ.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి పదవి నుంచి మాణిక్యం ఠాగూర్ తప్పుకున్న విషయం విదితమే. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు తన రాజీనామా లేఖను ఠాగూర్ పంపారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు.. ఠాగూర్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మాణిక్యం ఠాగూర్.. తెలంగాణ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న విభేదాలను చక్కదిద్దేందుకు దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగారు. ఎట్టకేలకు గోవా ఇన్చార్జిగా ఉన్న మాణిక్‌రావును తెలంగాణకు కేటాయించారు.
తెలంగాణ కాంగ్రెస్ వాట్సాప్ గ్రూప్ నుంచి ఠాగూర్ ఎగ్జిట్
తెలంగాణ కాంగ్రెస్ నేతల వాట్సాప్ గ్రూప్ నుంచి తప్పుకున్నట్లు మాణిక్యం ఠాగూర్ వెల్లడించారు. టీ కాంగ్రెస్ నేతల గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయింది నిజమే అని స్పష్టం చేశారు. ఏఐసీసీ వాట్సాప్ గ్రూపులో ఠాగూర్ కొనసాగుతున్నట్లు బోసురాజు వెల్లడించారు.