విధాత‌: తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జి ప‌ద‌వి నుంచి మాణికం ఠాగూర్ త‌ప్పుకున్నారు. ఈ మేర‌కు ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖర్గేకు త‌న రాజీనామా లేఖ‌ను ఠాగూర్ పంపారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్లు.. ఠాగూర్‌ను తీవ్రంగా వ్య‌తిరేకించారు. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన మాణికం ఠాగూర్.. తెలంగాణ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్న‌ట్లు స‌మాచారం. రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న విభేదాల‌ను చ‌క్క‌దిద్దేందుకు దిగ్విజ‌య్ సింగ్ రంగంలోకి దిగారు. దిగ్విజ‌య్ సింగ్ రిపోర్టుతో తెలంగాణ‌కు త్వ‌ర‌లోనే కొత్త ఇన్‌చార్జి […]

విధాత‌: తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జి ప‌ద‌వి నుంచి మాణికం ఠాగూర్ త‌ప్పుకున్నారు. ఈ మేర‌కు ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖర్గేకు త‌న రాజీనామా లేఖ‌ను ఠాగూర్ పంపారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్లు.. ఠాగూర్‌ను తీవ్రంగా వ్య‌తిరేకించారు.

దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన మాణికం ఠాగూర్.. తెలంగాణ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్న‌ట్లు స‌మాచారం. రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న విభేదాల‌ను చ‌క్క‌దిద్దేందుకు దిగ్విజ‌య్ సింగ్ రంగంలోకి దిగారు. దిగ్విజ‌య్ సింగ్ రిపోర్టుతో తెలంగాణ‌కు త్వ‌ర‌లోనే కొత్త ఇన్‌చార్జి రాబోతున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్

తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల వాట్సాప్ గ్రూప్ నుంచి త‌ప్పుకున్న‌ట్లు మాణిక్యం ఠాగూర్ వెల్ల‌డించారు. టీ కాంగ్రెస్ నేత‌ల గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయింది నిజ‌మే అని స్ప‌ష్టం చేశారు. ఏఐసీసీ వాట్సాప్ గ్రూపులో ఠాగూర్ కొన‌సాగుతున్న‌ట్లు బోసురాజు వెల్ల‌డించారు.

తెలంగాణ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంచార్జీగా మాణిక్‌రావు థాక్రే

Updated On 4 Jan 2023 3:45 PM GMT
krs

krs

Next Story