Tuesday, January 31, 2023
More
    Homelatestమనువాదుల చేతిలో రాజ్యాంగ సంస్థలు: భిక్ష‌మ‌య్య‌

    మనువాదుల చేతిలో రాజ్యాంగ సంస్థలు: భిక్ష‌మ‌య్య‌

    • లాల్, నీల్ మైత్రీ విధాన ముసాయిదా ఆవిష్కరణ

    విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మనువాద ఫాసిస్ట్ పాలకుల చేతిలో దేశమే సరుకు అయిందని, రాజ్యాంగ బద్దంగా ఉన్న సంస్థలన్నీ తమ కనుసన్నల్లోనే కొనసాగుతున్నాయని మాస్టర్ కీ టీవీ ఛానల్ సమన్వయ కర్త బొజ్జ భిక్షమయ్య అన్నారు.

    లాల్ నీల్ మైత్రీ వేదిక ఉమ్మడి వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విధాన పత్రం ముసాయిదా ఆవిష్కరణ సోమవారం హనుమకొండలో జరిగింది. ఈ కార్యక్రమానికి డా. పల్లేరు వీరాస్వామి అధ్యక్షత వహించారు. గౌరవ అతిథులుగా హాజరైన భిక్షమయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగమే ప్రమాదంలో పడిందని, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య జనం తల్లడిల్లితున్నారని ఆందోళన వెలిబుచ్చారు.

    మరొక అతిథి ప్రముఖ రచయిత రేకా చంద్ర శేఖర రావ్ మాట్లాడుతూ మార్క్సిజానికి, అంబేద్కరిజానికి మధ్య మిత్ర వైరుధ్యాలు ఉన్నాయని శత్రు వైరుధ్యాలేవని చెప్పారు. 1859 లో మార్క్స్ రాసిన ప్రఖ్యాత రచనలో “కులవ్యవస్థ కొన్ని కుటుంబాలకు భూ యాజమాన్య హక్కులు కల్పియించింది. మిగితా కుటుంబాలకు వారసత్వంగా శ్రమజేసి బతికే శాసనం కట్టడి జేసిందని అంటూ కులవ్యవస్థ శ్రమ విభజనే అని పేర్కొన్నాడు”.

    అదేవిదంగా డా.అంబెడ్కర్ కొలంబియా విశ్వవిద్యాలయానికి సమ‌ర్పించిన “భారత దేశంలో కులాలు” అనే ఒక పరిశోధన పత్రంలో నిచ్చెన మెట్ల కులవ్యవస్త పునాది మనువాదంలో ఉన్నదని, భారత దేశంలో నీవు ఏ మూలాన ఉన్నా వెంటాడేది అతి భయంకరమైన కులవ్యస్థని దాన్ని చంపకుండా ఈ విప్లవాన్ని సాధించలేరని అని అన్నారు.

    రచయిత డా మార్క శంకర్ నారాయణ లాల్- నీల్ మైత్రీ వేదిక నేపథ్యాన్ని వివరిస్తూ మిత్రుల మధ్య వైరుధ్యాలు వెతికేవాడు ఎన్నటికీ విజయ తీరాలను తాకలేడనీ, సామీప్యాలు వెతికేవాడు ఎన్ని సామ్రాజ్యాలైన గెలుస్తాడని, మనువాద ఫాసిజాన్ని మట్టుబెట్టటానీకి లాల్ శక్తులు ఐక్యం కావాలని, నీల్ శక్తులు ఐక్యం కావాలని ఈ రెండు శక్తుల మధ్య మైత్రీ ఎంతో అవసరమని చెప్పారు.

    ఎస్ డీ ఎల్ సి ఈ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎర్ర గట్టు స్వామి మాట్లాడుతూ నేడు లాల్-నీల్ మైత్రి అత్యంత ఆవశ్యకమని అన్నారు. కవియిత్రి చందనాలు సుమిత్ర లాల్-నీల్ మైత్రీ వేదిక విధానం పత్రం ముసాయిదా పుస్తకాన్ని సమీక్షించారు. నల్ల సుధాకర్ రెడ్డి, రాంబ్రహం, వెంగల్ రెడ్డి, నన్నపురాజు రవీందర్ తదితరులు ప్రసంగించారు.

    తదనంతరం వేదిక గౌరవ అధక్షులుగా డా. పల్లేరు వీరాస్వామి, డా. మార్క శంకర్ నారాయణ, కన్వీనర్ గా నన్నపురాజు రవీందర్, కో-కన్వీనర్ గా కే. చంద్ర మొగిలి, కమిటీ సభ్యులుగా చందనాలు సుమిత్ర, నిధి, నల్ల సుధాకర్ రెడ్డి, రాంబ్రహం, వెంగల్ రెడ్డి, పైళ్ల క్రాంతి కుమార్, దామెర రాజేందర్, సిఎచ్. రవీందర్, ఖాజామొయినొద్దీన్, డా. పాక వెంకటేశ్వర్లు, చాగంటి కిషన్, గజ్జెల స్వరూప, మేడిపెల్లి శోభన్ బాబు, ఉమాశంకర్, డా. కుమారస్వామి, తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular