Marimuthu | చెన్నైలో టీవీ షోకు డ‌బ్బింగ్ చెప్తుండ‌గా గుండెపోటు ఒక్క‌సారిగా షాక్ గురైన త‌మిళ‌చిత్ర ప‌రిశ్ర‌మ‌ జైలర్ సినిమాలో విల‌న్‌గా న‌టించిన మ‌రిమ‌త్తు విధాత‌: త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం నెల‌కొన్న‌ది. ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు జీ మరిముత్తు గుండెపోటుతో హ‌ఠాత్తుగా క‌న్నుమూశారు. శుక్ర‌వారం ఉద‌యం 8.30 గంటల ప్రాంతంలో ఓ టెలివిజన్ షోకు డబ్బింగ్ చెప్తూ ఒక్క‌సారిగా కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆయ‌న‌ను సమీపంలోని ద‌వాఖాన‌కు సిబ్బంది త‌ర‌లించారు. ఆయ‌న అప్ప‌టికే చ‌నిపోయిన‌ట్టు వైద్యులు […]

Marimuthu |

  • చెన్నైలో టీవీ షోకు డ‌బ్బింగ్ చెప్తుండ‌గా గుండెపోటు
  • ఒక్క‌సారిగా షాక్ గురైన త‌మిళ‌చిత్ర ప‌రిశ్ర‌మ‌
  • జైలర్ సినిమాలో విల‌న్‌గా న‌టించిన మ‌రిమ‌త్తు

విధాత‌: త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం నెల‌కొన్న‌ది. ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు జీ మరిముత్తు గుండెపోటుతో హ‌ఠాత్తుగా క‌న్నుమూశారు. శుక్ర‌వారం ఉద‌యం 8.30 గంటల ప్రాంతంలో ఓ టెలివిజన్ షోకు డబ్బింగ్ చెప్తూ ఒక్క‌సారిగా కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆయ‌న‌ను సమీపంలోని ద‌వాఖాన‌కు సిబ్బంది త‌ర‌లించారు. ఆయ‌న అప్ప‌టికే చ‌నిపోయిన‌ట్టు వైద్యులు ధ్రువీక‌రించారు.

మరిముత్తు ఆకస్మిక మరణం త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయ‌న‌కు భార్య బక్కియ్యలక్ష్మి, ఇద్దరు పిల్లలు - అఖిలన్, ఐశ్వర్య ఉన్నారు. మరిముత్తు విల‌న్ పాత్ర‌కు ప్ర‌సిద్ధి. రజనీకాంత్ తాజా చిత్రం జైల‌ర్‌లో మ‌రిముత్తు విల‌న్‌గా న‌టించారు.

శుక్ర‌వారం ఉద‌యం సహోద్యోగి కమలేశ్‌తో కలిసి తన టీవీ షో 'ఎతిర్ నీచల్' కోసం డబ్బింగ్ చెప్తూ చెన్నైలోని స్టూడియోలో కుప్పకూలిపోయారు. చెన్నైలోని వడపళనిలోని ఓ ప్రైవేట్ ద‌వాఖాన‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

కాగా.. ఆయన భౌతికకాయాన్ని ప్రజల సంద‌ర్శ‌నార్థం చెన్నైలోని ఆయన స్వగృహానికి (విరుగంబాక్కంలో) తరలించనున్నారు. అనంత‌రం మ‌రిముత్తు భౌతికకాయాన్ని స్వగ్రామమైన తేనికి తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మ‌రిముత్తు ఆక‌స్మిక మృతి వార్త విన్న సహ నటులు ద‌వాఖాన‌కు చేరుకున్నారు.

Updated On 8 Sep 2023 9:08 AM GMT
somu

somu

Next Story