Mark Antony విశాల్ - ఎస్‌జే సూర్య ద్విపాత్రాభినయం చేసిన ‘మార్క్ ఆంటోని’ చిత్రం విడుదలకు సిద్ధమైన వేళ.. ఆ సినిమాకు కోర్టు చిక్కులు ఎదురయ్యాయి. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా విడుదలకాకుండా మద్రాస్ హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. అలాగే, ఈనెల 12వ తేదీన హీరో విశాల్ కోర్టుకు స్వయంగా హాజరుకావాలంటూ ఆదేశిస్తూ.. తదుపరి విచారణను వాయిదా వేసింది. ప్రముఖ సినీ ఫైనాన్షియర్ అన్బు చెళియన్ వద్ద హీరో విశాల్ తన చిత్రాల […]

Mark Antony
విశాల్ - ఎస్‌జే సూర్య ద్విపాత్రాభినయం చేసిన ‘మార్క్ ఆంటోని’ చిత్రం విడుదలకు సిద్ధమైన వేళ.. ఆ సినిమాకు కోర్టు చిక్కులు ఎదురయ్యాయి. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా విడుదలకాకుండా మద్రాస్ హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది.
అలాగే, ఈనెల 12వ తేదీన హీరో విశాల్ కోర్టుకు స్వయంగా హాజరుకావాలంటూ ఆదేశిస్తూ.. తదుపరి విచారణను వాయిదా వేసింది. ప్రముఖ సినీ ఫైనాన్షియర్ అన్బు చెళియన్ వద్ద హీరో విశాల్ తన చిత్రాల నిర్మాణ కోసం రూ.21.29 కోట్ల రుణం తీసుకోగా, దీన్ని తిరిగి చెల్లించకపోవడంతో కోర్టును ఆశ్రయించారు.
ఆ సమయంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ముందుకు వచ్చి ఆ రుణం చెల్లించేలా హామీ ఇస్తూ.. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీపై నిర్మించే అన్ని చిత్రాల రిలీజ్ హక్కులను తమకే అప్పగించేలా ఆదేశించాలని కోరింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి పిటి ఆషా.. విశాల్ రూ.15 కోట్లు హైకోర్టు రిజిస్టార్‌కు డిపాజిట్ చేయాలని, మొత్తం ఆస్తుల వివరాలను కూడా సమర్పించాలని ఆదేశించారు.
ఈ ఆదేశాలను విశాల్ డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయగా ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ శుక్రవారం మరోమారు విచారణకు వచ్చింది. ఆ సమయంలో లైకా ప్రొడక్షన్స్ తరపున ఒక పిటిషన్ దాఖలైంది. అందులో కోర్టు ఆదేశం మేరకు విశాల్ రూ.15 కోట్లు డిపాజిట్ చేయలేదని.. అలాగే, ఆయన ఆస్తులకు సంబంధించి తప్పుడు వివరాలను సమర్పించి, కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారంటూ వాదనలు వినిపించాయి.
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించి ఈనెల 15వ తేదీన ‘మార్క్ ఆంటోని’ విడుదలకాకుండా తాత్కాలిక స్టే విధిస్తూ, ఈనెల 12వ తేదీన విశాల్ స్వయంగా కోర్టుకు హాజరుకావాలని సింగిల్ జడ్డి ఆషా ఆదేశించారు. దీంతో ‘మార్క్ ఆంటోని’ విడుదల డైలమాలో పడింది. ఇప్పటి వరకు సెప్టెంబర్ 15వ తేదీ రిలీజ్ అని ప్రకటించిన రెండు చిత్రాలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు విశాల్ చిత్రంపై కూడా డౌట్స్ వ్యక్తమవుతుండటం గమనార్హం
