Maharashtra సహ జీవనం చేస్తున్న యువతిని చంపేసిన వివాహితుడు మృతదేహాన్ని మాయం చేసేందుకు సహకరించిన భార్య మహారాష్ట్ర పాల్ఘర్‌ జిల్లాలో ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి మృతురాలు మేకప్‌ ఆర్టిస్ట్‌.. నిందితుడు కాస్టూమ్స్‌ డిజైనర్‌ విధాత: వివాహేతర సంబంధాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేయడమే కాకుండా హత్యలకు ఉసిగొల్పుతున్నాయి. అప్పటికే వివాహమై భార్య ఉన్నప్పటికీ ఈ విషయాన్ని దాచి ఓ యువకుడు మరొకరితో సహజీవనం చేశాడు. ఆమె పెండ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ఆమెను చంపేశాడు. మృతదేహాన్ని మాయం చేయడానికి […]

Maharashtra

  • సహ జీవనం చేస్తున్న యువతిని చంపేసిన వివాహితుడు
  • మృతదేహాన్ని మాయం చేసేందుకు సహకరించిన భార్య
  • మహారాష్ట్ర పాల్ఘర్‌ జిల్లాలో ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి
  • మృతురాలు మేకప్‌ ఆర్టిస్ట్‌.. నిందితుడు కాస్టూమ్స్‌ డిజైనర్‌

విధాత: వివాహేతర సంబంధాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేయడమే కాకుండా హత్యలకు ఉసిగొల్పుతున్నాయి. అప్పటికే వివాహమై భార్య ఉన్నప్పటికీ ఈ విషయాన్ని దాచి ఓ యువకుడు మరొకరితో సహజీవనం చేశాడు. ఆమె పెండ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ఆమెను చంపేశాడు.

మృతదేహాన్ని మాయం చేయడానికి ఏకంగా భార్య సహాయం కోరాడు. మహారాష్ట్ర పాల్ఘర్‌ జిల్లాలో ఆగస్టులో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మంగళవారం నిందితుడితోపాటు అతడికి సహకరించిన భార్యను సైతం పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాకు చెందిన మనోహర్‌ శుక్లా సినిమా ఇండస్ట్రీలో కాస్టూమ్స్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి అప్పటికే వివాహమైంది. అదే పరిశ్రమలో మేకప్‌ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న నైనా మహత్‌ (28) తో అతడికి పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.

తనకు పెండ్లి అయిన విషయం దాడిపెట్టి ఐదేండ్లుగా నైనాతో శుక్లా సహజీవనం చేస్తున్నాడు. ఇటీవల ఆమె తనను పెండ్లి చేసుకోవాలని శుక్లాపై ఒత్తిడి తెచ్చింది. వివాహం చేసుకోనని శుక్లా తెగేసి చెప్పడంతో అతడిపై నైనా రేప్‌ కేసు పెట్టింది. కేసు వాపస్‌ తీసుకోవాలని శుక్లా ఆమెను బెదిరించాడు.

అయినా ఒప్పుకోకపోవడంతో ఆగస్టు 9వ తేదీన నైనాను చంపేశాడు. మృతదేహాన్ని మాయంచేసేందుకు భార్య సహాయం కోరాడు. ఇద్దరూ కలిసి సూట్‌కేసులో మృతదేహాన్ని కుక్కి గుజరాత్‌ సమీపంలోని వల్సాద్‌ జిల్లాలోని ఓ కాలువలో నైనా మృతదేహాన్ని పడేశారు.

నైనా కనిపించడం లేదని ఆమె కుటుంబసభ్యులు ఆగస్టు 12న మహారాష్ట్రలోని నయ్‌గావ్‌ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కాంప్లెయింట్‌ ఇచ్చారు. నైనా ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వస్తున్నదని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాపు చేపట్టిన పోలీసులు.. నిందితుడు శుక్లాతోపాటు హత్యలో సహకారం అందించిన అతడిని భార్యను సైతం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

Updated On 13 Sep 2023 10:42 AM GMT
somu

somu

Next Story