- ఎగబడి, జుట్లు పట్టుకొని కొట్టుకొన్న ప్రయాణికులు
- చికాగో ఎయిర్‌పోర్ట్‌లో ఘటన.. వైరలైన వీడియోలు
విధాత: గల్లీల్లో చిన్నపిల్లలు పొర్లాడి పొర్లాడి కొట్టుకున్నట్టు.. కాలేజీలో యువకులు ఎగబడి కలబడినట్టు.. పిడిగుద్దులు గుద్దుకున్నట్టు.. నడిరోడ్డు యువతులు జట్టు పట్టుకొని కొట్టుకున్నట్టు మాస్ ఫైటింగ్ జరిగింది. ఏకంగా ఎయిర్‌పోర్టులోనే ప్రయాణికులు డిష్యుం.. డిష్యుంకు దిగారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అమెరికాలోని చికాగో (Chicago) ఎయిర్‌పోర్టులో ఈ ఘటన జరిగింది. ఈ కొట్లాటకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Brawl at Chicago O’Hare airport this morning pic.twitter.com/fsH6n3yABd
— Mr Bogus (@Mr_Bogus0007) May 23, 2023
వాగ్వాదంతో మొదలు
విమానం దిగి వస్తుండగా తొలుత చిన్నవాగ్వాదంతో మొదలైన గొడవ తీవ్రంగా కొట్టుకొనే వరకు వెళ్లింది. విమానాశ్రయంలో లగేజీలు తీసుకొనే చోట ఒక మహిళపై ఇద్దరు చేయిచేసుకోవడంతో లొల్లి మొదలైంది. టెర్మినల్ 3 వద్ద జరిగిన ఈ ఘర్షణలో సుమారు 12 వరకు ఉన్నారు. కొందరు వ్యక్తులు నేలపై పడి మరీ కొట్టుకోవడం వీడియోల్లో కనిపించింది.
తొలుత మహిళపై దాడి చేసిన ఇద్దరిని గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యం తమకు ముఖ్యమని విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. వీరిని ఒలింపిక్స్‌కు పంపిస్తే మనకు పతకం గ్యారెంటీ అని నెటిజన్ వ్యాఖ్యానించారు