మున్సిపల్ అత్యవసర సమావేశం నేడు కీలక పరిణామాలు విధాత, నిజామాబాద్: సుదీర్ఘ రైతు ఉద్యమం తర్వాత కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై ప్రభుత్వంలో కదలిక వచ్చింది. రైతు ఉద్యమం ఫలించింది. ఎట్టకేలకు మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి ప్రకటించారు. మాస్టర్ ప్లాన్‌లో ఉన్నత స్థాయిలో మార్పులు జరిగాయని అంగీకరించారు. ఇదే విషయాన్ని గతంలో ఎమ్మెల్యే గంప గోవర్దన్ కూడా చెప్పారు. ఒక రైతు ఆత్మహత్య, మరో రైతు ఆత్మహత్యాయత్నం, కలెక్టరేట్ ముట్టడిలో […]

  • మున్సిపల్ అత్యవసర సమావేశం
  • నేడు కీలక పరిణామాలు

విధాత, నిజామాబాద్: సుదీర్ఘ రైతు ఉద్యమం తర్వాత కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై ప్రభుత్వంలో కదలిక వచ్చింది. రైతు ఉద్యమం ఫలించింది. ఎట్టకేలకు మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి ప్రకటించారు. మాస్టర్ ప్లాన్‌లో ఉన్నత స్థాయిలో మార్పులు జరిగాయని అంగీకరించారు. ఇదే విషయాన్ని గతంలో ఎమ్మెల్యే గంప గోవర్దన్ కూడా చెప్పారు.

ఒక రైతు ఆత్మహత్య, మరో రైతు ఆత్మహత్యాయత్నం, కలెక్టరేట్ ముట్టడిలో రైతులకు గాయాలు, అరెస్ట్ లు, ధర్నాలు, రాస్తా రోకో, బంద్ వంటి నిరసన కార్యక్రమాలతో అట్టుడికిన కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దుతో తాత్కాలికంగా సద్దుమణిగింది.

ఈనెల 20న ఎమ్మెల్యే ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ వాయిదా వేసింది. అడ్లూర్ గ్రామంలోని కృష్ణ మందిరం వద్ద శుక్రవారం ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశమై భవిష్యత్ ప్రణాళికపై చర్చించనున్నారు.

కాగా గురువారం విలీన గ్రామాలకు చెందిన బీజేపీ కౌన్సిలర్లు సుతారి రవి, కాసర్ల శ్రీనివాస్ తమ కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులతో కలిసి రాజీనామా పత్రాలను మున్సిపల్ కమిషనర్ దేవేందర్ కు అందజేశారు.

విలీన గ్రామాల్లో కాంగ్రెస్ కు కౌన్సిలర్లు లేకపోవడంతో కామారెడ్డి పట్టణానికి చెందిన నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు తమ రాజీనామా పత్రాలను షబ్బీర్ అలీకి అప్పగించి సేఫ్ జోన్‌లోనే ఉండి తమ త్యాగ నిరతిని చాటుకున్నారు.

Updated On 20 Jan 2023 3:27 AM GMT
krs

krs

Next Story