విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురం గ్రామంలోని ప్రసిద్ధం పుణ్యక్షేత్రం మత్స్యగిరి గుట్ట దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవ ఘట్టం భక్తుల కనుల పండుగగా నిర్వహించారు. జగద్రక్షకుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన మత్స్యగిరి నరసింహుడుని క్షీర సముద్ర తనయ లక్ష్మీ అమ్మవార్లను వధూవరులుగా పట్టు వస్త్రములు, స్వర్ణ రత్న ఖచ్చిత ఆభరణాలతో అలంకరించి కళ్యాణ వేదికపై ఆసీనులను చేసిన పండిత బృందం కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణ […]

విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురం గ్రామంలోని ప్రసిద్ధం పుణ్యక్షేత్రం మత్స్యగిరి గుట్ట దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవ ఘట్టం భక్తుల కనుల పండుగగా నిర్వహించారు.

జగద్రక్షకుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన మత్స్యగిరి నరసింహుడుని క్షీర సముద్ర తనయ లక్ష్మీ అమ్మవార్లను వధూవరులుగా పట్టు వస్త్రములు, స్వర్ణ రత్న ఖచ్చిత ఆభరణాలతో అలంకరించి కళ్యాణ వేదికపై ఆసీనులను చేసిన పండిత బృందం కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు.

భక్తుల గోవింద నామస్మరణ మధ్య పాంచరాత్రాగమ శాస్త్రానుసారం స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని వేద పండితులు ఆద్యంతం స్వామి,అమ్మ వార్ల గుణగణ విశేషాలను, అవతార ప్రత్యేకతలను వివరిస్తూ అంగరంగా వైభవంగా నిర్వహించారు.

జగత్ కళ్యాణం కోసం సోమకాసురుడిని సంహరించి వేదాలను పరిరక్షించేందుకు మత్స్యావతారధారియైన స్వామి వారికి, లక్ష్మీ అమ్మవార్లకు జరిగిన కళ్యాణోత్సవాన్ని తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంతో పులకించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి, కార్యనిర్వహణ అధికారి జిల్లపల్లి జయరామయ్య, ఎంపీటీసీ సామరామిరెడ్డి, వెంకటాపురం గ్రామ సర్పంచ్ కొత్త నరసింహ,

మాజీ చైర్మన్ చిటెడ్డి జనార్దన్ రెడ్డి, తుమ్మల వెంకట్ రెడ్డి కేశిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి , మాజీ సింగిల్ విండో చైర్మన్ వాకిటి అనంతరెడ్డి, వలిగొండ మార్కెట్ చైర్ పర్సన్ కోనపురి కవిత, వేద పండితులు, ఆలయ అర్చక బృందం, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated On 5 Nov 2022 10:54 AM GMT
krs

krs

Next Story