Medak
- రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు….
- తండ్రి,కొడుకు… భార్యా భర్తలు మృతి..
విధాత, మెదక్ బ్యూరో: రెక్కాడితే గాని డొక్కాడని కూలి కుటుంబాలు రోడ్డు ప్రమాదంలో మరణించన విషాద సంఘటన మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రము పరిధిలో జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా వున్నాయి.
గజ్వేల్ నుండి ఆర్మూర్ నియోజక వర్గంలోని ఏలూరు గ్రామానికి 2 కుటుంబాలు వలస పోయాయి. అయితే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లో తమ సమీప బంధువు మరణించడంతో దశ దినకర్మకు ఆదివారం ఆర్మూర్ నుండి ఆ 2 కుటుంబాలు బయలుదేరారు. ఇప్ప శేకర్(46), అతని కుమారుడు ఇప్ప యశ్వంత్(9)తో పాటు గుంటక బాల్ నర్సయ్య(70), అతని భార్య గుంటుక మణెమ్మ (62) ఆర్మూర్ నుండి ఆటోలో గజ్వేల్ వెళ్తున్నారు.
ఈ క్రమంలో నార్సింగి వద్ద వెనుక నుండి ఇన్నోవ కారు ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటో బోల్తా పడి అందులో ఉన్న ఈ నలుగురు మృతి చెందారు. ఆటో నడుపుతున్న ఇప్ప శేకర్ తో పాటు అతని కుమారుడు యశ్వంత్, వృద్ద దంపతులు నర్సయ్య, మనెమ్మ అక్కడికక్కడే మరణించారు.
నార్సింగి ఎస్ ఐ నర్సింహులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరణించిన 4 గురి మృతదే
హాలను రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మరణించిన పేద రైతు కూలీ కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. నార్సింగి పోలీసులు బంధువులకు సమాచారం అందించారు.