Medak
- ఇద్దరు కీలక మంత్రుల అమెరికా పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- కేటీఆర్ హుస్నాబాద్ పర్యటనపై హరీష్ అసంతృప్తి
- బావ.. బామ్మర్దుల మధ్య సయోధ్య కుదిరేనా?
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు కీలక మంత్రులు, గులాబీ దళపతికి కుడి ఎడమగా ఉండి తెలంగాణ ప్రభుత్వంలో, పార్టీలో కీలకంగా ఉన్న బావ బామ్మర్ధులు కేటీఆర్, హరీశ్‌రావుల మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని BRS పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇటీవల సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మంత్రి హరీష్ రావుకు సమాచారం లేకుండానే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమం సొంత జిల్లా సొంత నియోజకవర్గంలో తనకు తెలియకుండా కార్యక్రమాలు ఫిక్స్ చేయడం పట్ల ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం జరిగింది.
మంత్రి హరీష్ రావుతో పాటు ఆయన వర్గానికి చెందిన నాయకులు హుస్నాబాద్‌లో కేటీఆర్ నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ సమావేశంలోనే కరీంనగర్ మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ను కరీంనగర్ బీ ఆర్ యస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కే టి ఆర్ సభలోనే ప్రకటించారు.
వినోద్ కుమార్‌తో చర్చలు విఫలం..
ఇద్దరు మంత్రుల మధ్య సయోధ్య కుదుర్చడానికి మాజీ ఎంపీ వినోద్ కుమార్ హరీష్ రావు తో చర్చలు జరపడానికి సిద్దిపేట మంత్రి క్యాంప్ కార్యాలయానికి ప్రోగ్రాం జరిగిన రాత్రే చేరుకున్నట్లు సమాచారం. ఐతే హరీష్ రావ్ వినోద్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్నికల వేళ ఈ పరిణామం ఎటుదారి తీస్తుందో నని ఆందోళన చెంది, ఈ వివాదం పరిష్కారం కోసం స్వయంగా బంధువులు రంగం లోకి దిగినట్లు సమాచారం.
అమెరికా వేదికగా… చర్చలు
ఇద్దరు కీలక మంత్రులు, స్వయానా బావ బామ్మర్డులు కావడంతో బంధువుల కల్పించుకొని అమెరికాలో ఇద్దరి నేతలకు సర్ది చెప్పినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఐతే ఇద్దరి మధ్య సఖ్యత కుదిరి నట్లేనా… ఎన్నికల వరకు ఇలాగే నడుస్తుందా వేచి చూడాలి మరి..